Sleep: ప్రశాంతమైన నిద్రకి సులభమైన మార్గాలు..!

Sleep: ప్రశాంతమైన నిద్రకి సులభమైన మార్గాలు..!

Update: 2022-09-02 05:49 GMT

Sleep: ప్రశాంతమైన నిద్రకి సులభమైన మార్గాలు..!

Sleep: నిద్ర మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. లేదంటే రోజంతా పనిచేయడం చాలా కష్టం. చాలా మంది ఆరోగ్య నిపుణులు 24 గంటల్లో కనీసం 8 గంటలు నిద్రపోవాలని చెబుతారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోని వ్యక్తులు రోజంతా అలసిపోయినట్లు కనిపిస్తారు. ముఖం మొత్తం వాడిపోయి ఉంటారు. అయితే కొందరికి నిద్రించడానికి ఫుల్ టైమ్ ఉంటుంది. కానీ రాత్రంతా అశాంతితో గడపాల్సి వస్తుంది. ప్రశాంతమైన నిద్ర రాదు. అందుకే సుఖమైన నిద్ర కోసం కొన్ని చిట్కాలని తెలుసుకుందాం.

కొందరు వ్యక్తులు దిండ్లను చాలా ఇష్టపడతారు. వారు నిద్రించడానికి ఒకటి కాదు అనేక దిండ్లను ఉపయోగిస్తారు. మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎక్కువ దిండ్లు వాడటం వల్ల మెడ ఎత్తులో ఉండి గురక పెట్టడం ప్రారంభిస్తారు. అలాగే నిద్ర కూడా చెదిరిపోతుంది. చాలా సార్లు పరుపు అడుగు భాగం కిందికి జారుతుంది. దీనివల్ల నడుము నొప్పి ఏర్పడి నిద్రభంగం జరుగుతుంది. పరుపు ఎప్పుడైనా నిటారుగా ఉండాలి. దీనివల్ల పాదాల నుంచి గుండెకు రక్తం సరిగ్గా ప్రవహిస్తుంది. నిద్ర సుఖంగా పడుతుంది.

మీరు ఒత్తిడి కారణంగా నిద్రపోలేకపోతే ముందుగా మనస్సులో పాజిటివ్‌ ఆలోచనలు చేయండి. మృదువైన సంగీతాన్ని వినండి. ఇది మీకు రిలాక్స్‌ని అందిస్తుంది. మంచి నిద్ర పోవడానికి దోహదపడుతుంది. మీరు ప్రతిరోజూ మీ నిద్రవేళను మార్చకోకండి. ఒక సమయానికి నిద్రిస్తే ఆరోగ్యానికి మంచిది. మీ మెదడులో స్లీప్ సైకిల్ స్థిరపడి నిద్ర పట్టడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మంచి నిద్రని ఆస్వాదించవచ్చు.

Tags:    

Similar News