పేల సమస్యకి ఈ చెట్టు ఆకులతో చెక్.. ఎలాగంటే..?

పేల సమస్యకి ఈ చెట్టు ఆకులతో చెక్.. ఎలాగంటే..?

Update: 2022-02-12 14:30 GMT

పేల సమస్యకి ఈ చెట్టు ఆకులతో చెక్.. ఎలాగంటే..?

Neem Leaves: పేల సమస్య చాలా సాధారణ సమస్య. కానీ చికాకు ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో పేల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హెయిర్ లూస్ అనేది ఒక రకమైన పరాన్నజీవి ఇది తలకు, వెంట్రుకలకు అతుక్కుని నెత్తిమీద నుంచి రక్తాన్ని పీల్చుకుంటుంది. కొన్నిసార్లు అవి చాలా వేగంగా సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. పేలు ఎక్కువైతే వాటిని తొలగించడం చాలా కష్టం. అయితే వేప చెట్టు ఆకులతో తల పేను సమస్యను తొలగించవచ్చు. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

వేప చెట్టుని ఔషధ గుణాల నిధిగా పరిగణిస్తారు. దీని ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి తలకు, జుట్టుకు మేలు చేస్తాయి. వేపను ఉపయోగిస్తే స్కాల్ప్, ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది. తలలో పేనుకు పోషకాహారం, తగిన వాతావరణం లభించదు. దీని కారణంగా అవి చనిపోతాయి. తాజా వేప ఆకులతో కూడా చికిత్స చేయవచ్చు. ఇందుకోసం కొన్ని వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఫిల్టర్ చేయాలి. మీరు షాంపూతో మీ జుట్టును కడగేటప్పుడు ఈ నీటితో మీ తలని కడగాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే ఫలితం ఉంటుంది.

పేలని చంపడానికి వేపనూనె, కొబ్బరి నూనెను సమాన పరిమాణంలో మిక్స్ చేసి తలకు 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తరువాత దువ్వెన, షాంపూ ద్వారా జుట్టు, తల నుంచి పేను తొలగించాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పేను తొలగించడానికి పొడి వేప ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేయాలి. ఇందులో నిమ్మరసం కలిపి జుట్టు, తలకు బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. వారానికి 3 నుంచి 4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Tags:    

Similar News