Neem Leaves: వేప ఆకులలో అద్భుత ఔషధ గుణాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి నివారణ..!
Neem Leaves: వేప ఆకులని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు.
Neem Leaves: వేప ఆకులని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు. వీటి ద్వారా మందుల తయారీ జరుగుతుంది. చాలా వ్యాధులకి చక్కటి నివారణగా పనిచేస్తాయి. గ్రామాలలో నివసించేవారికి చాలామందికి వేప గుణాలు తెలిసే ఉంటాయి. వేప ఆకులు అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది. ప్రయోజనాల గురంచి తెలుసుకుందాం. కుష్టు వ్యాధికి వేప ఆకులను ఉపయోగిస్తారు. వీటి వాడకం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతే కాకుండా పొట్టలో ఉండే పురుగులు, కడుపు నొప్పి, ఆకలి మందగించడం, చర్మపు పూతల వంటి వ్యాధులు తగ్గుతాయి.
మీరు వేప ఆకులను ఉడికించి ఆ నీటితో టీ తయారుచేసుకొని తాగవచ్చు. ఇది కొంచెం చేదుగా ఉంటుంది కావొచ్చు. కానీ చాలా ప్రయోజనాలు ఉంటాయి. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా మధుమేహ రోగులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు వేప ఆకులను ఉపయోగించవచ్చు. ఇందుకోసం వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు. దీంతో చర్మంపై ఎలాంటి అలర్జీనైనా దూరం అవుతుంది.
పరసం కొద్దిగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఈ జ్యూస్ యాంటీ వైరల్‌లా పనిచేస్తుండటంతో..వైరల్ ఫీవర్లు తగ్గుతాయి. కార్డియో వాస్కులర్ సమస్యలు దూరమౌతాయి. వేపరసంతో మధుమేహం వ్యాధి రాకుండా నివారించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను వేపరసం బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా..రోగ నిరోధక శక్తిని పెంచడంతో దోహదపడుతుంది.