Health Tips: మటన్,చికెన్ కన్నా ఈ వెజిటేరియన్ ఫుడ్స్‎లో అధిక ప్రోటీన్ లభిస్తోంది..అవేంటో మీరు ఓ లుక్కేయండి

Health Tips: వెజిటేరియన్ లో కూడా కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నట్లయితే మాంసాహారం కన్నా ఎక్కువ పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-07-12 02:30 GMT

Health Tips: మటన్,చికెన్ కన్నా ఈ వెజిటేరియన్ ఫుడ్స్‎లో అధిక ప్రోటీన్ లభిస్తోంది..అవేంటో మీరు ఓ లుక్కేయండి

Health Tips: వెజిటేరియన్ లో కూడా కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నట్లయితే మాంసాహారం కన్నా ఎక్కువ పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వెజిటేరియన్ ఫుడ్ లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయని అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు వచ్చే అవకాశం ఉందని అపోహ ఉంది. కానీ వెజిటేరియన్ ఆహారాల్లో కూడా ప్రోటీన్లు అత్యధికంగా ఉండే ఫుడ్స్ చాలా ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా మీరు అధిక శాతంలో ప్రోటీన్లను పొందవచ్చు. అలాగే మీ శరీరానికి కావలసిన కండరాలను నిర్మించుకోవచ్చు. అలాంటి ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాజ్‌మా గింజలు:

రాజ్‌మా గింజల్లో అత్యధిక శాతంలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఐరన్ అలాగే మెగ్నీషియం, బయోటిన్ వంటి పోషకాలను అత్యధిక స్థాయిలో కలిగి ఉంటాయి. వీటితోపాటు ఇందులో అధిక శాతంలో వీగాన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. రాజ్‌మా గింజలను తరచూ మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున ప్రోటీన్లను మీరు పొందవచ్చు. అలాగే మంచి పోషకాలు కూడా మీకు లభిస్తాయి.

పూల్ మఖాన గింజలు:

పూల్ మఖాన గింజలు అంటే తామర గింజలు అని అర్థం. తామర పువ్వుల్లో మొదలు నుంచి ఈ గింజలను సేకరిస్తారు. ఈ గింజలను సేకరించిన తర్వాత వీటిని వేడి చేసి పేలాలుగా మారుస్తారు. వీటిని పూల్ మఖాన అంటారు. ఉత్తర భారత దేశంలో చాలామంది వీటిని తీసుకుంటారు. వీటితో కూరలు తయారు చేసుకోవచ్చు. మిల్ మేకర్ తరహాలోనే టేస్ట్ ఉంటుంది. అయితే ఈ పూల్ మఖాన గింజల్లో అత్యధిక శాతంలో ప్రోటీన్ లభిస్తుంది. మాంసాహారం తినని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం పూల్ మఖానా గింజలు నెయ్యిలో వేయించుకొని కూడా తినవచ్చు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి.. వీటిలో అధిక మొత్తంలో కాల్షియం కూడా లభిస్తుంది.

ఉలవలు:

ఉలవలతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉలవల్లో అత్యధిక శాతం లో ఫైబర్ అలాగే ప్రోటీన్లు లభిస్తాయి. ఉలవలతో చేసే చారు చాలా ఫేమస్. ఉలవలను నానబెట్టి ఆ తర్వాత ఉడకబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా వరకు ప్రోటీన్లను కలిగి ఉంటుంది వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

కాబూలీ సెనగలు:

కాబూలీ సెనగల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోటీన్లు లభిస్తాయి వీటిని నానబెట్టుకొని కూరగా చేసుకుని తినవచ్చు. ఉత్తర భారత దేశంలో చోలే అంటూ చేసే కూరల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా రుచికరంగా ఉంటాయి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లలో కాబూలీ సెనగల గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు.

Tags:    

Similar News