ఈ వ్యాధి అబ్బాయిలలో కంటే అమ్మాయిలలోనే ఎక్కువ.. ఎందుకంటే..?
ఈ వ్యాధి అబ్బాయిలలో కంటే అమ్మాయిలలోనే ఎక్కువ.. ఎందుకంటే..?
Migraine: మైగ్రేన్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికి వస్తుంది. మారిన జీవన విధానం, పొల్యూషన్ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. చిన్న వయసులో రావడంతో పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు. అంతేకాదు ఈ సమస్య అబ్బాయిలలో కంటే అమ్మాయిలలో ఎక్కువగా వస్తుంది. మైగ్రేన్ కారణంగా రక్త నాళాలు ఎర్రబడుతాయి. దీంతో రోగికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది.
మైగ్రేన్‌తో బాధపడేవారిలో విశ్రాంతి లేకపోవడం, భయం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం మొదలైన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. రోగి మెదడులోని చిన్న భాగంలో రక్త ప్రసరణ కొంత సమయం వరకు ఆగిపోతుంది. దీని కారణంగా రక్త నాళాలు ఉబ్బిపోతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుందని నిపుణలు చెబుతున్నారు. మీరు మైగ్రేన్ పేషెంట్ అయితే స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా 40 ఏళ్లు దాటిన తర్వాత వస్తుంది.
మైగ్రేన్ కారణంగా మెదడులోని రక్తనాళాల వేగం తగ్గిపోతుంది లేదా కొంతకాలం ఆగిపోతుంది దీంతో స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. దీని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే BP ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది కాకుండా మీరు పొగ తాగకూడదు. సిగరెట్, గుట్కా, పొగాకు దూరంగా ఉండాలి. దీంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. మైగ్రేన్ వ్యాధిగ్రస్తులు తమ హృదయాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధి వల్ల మీ గుండె ప్రమాదంలో ఉంటుంది. మైగ్రేన్ రోగులు ప్రతిరోజూ దాదాపు 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి. యోగా చేస్తే మీరు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.