Methi Leaves Benefits: జీర్ట సమస్యలకు చెక్ పెట్టే మెంతి ఆకు

కేశ సౌందర్యం కొరే మహిళలకు మెంతి ఆకులు ఒక వరంగా భావించాలి

Update: 2021-02-19 07:02 GMT

file image

Methi Leaves Benefits: అందరికీ అందుబాటులో వుంటూ పచ్చటి ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో ప్రధానమైనవి. ఇటువంటి ఆకుకూరలలో మెంతికూర ఒకటి. మనం దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తాము. మెంతులను సువాసనా ద్రవ్యంగా పోపుల పెట్టె మసాలా దినుసులలో ఒకటిగా ఉపయోగిస్తాము. మెంతికూరలో అతి విలువైన పోషకాలు వుంటాయి. మనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువ. పెరటిలో పెంచటం తేలిక. విత్తనాలు చల్లిన కొద్ది రోజులలో మొక్కల ఆకులను మనం ఆహారంగా వాడుకోవచ్చు.

ఇక పచ్చటి మెంతి కూర ఆకు ఎంతో రుచికరంగాను, ఔషధ విలువలు కలిగి వుంటుంది. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులుసైతం ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి. మెంతికూర తినడం వల్ల నడుము నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.అంతేకాదు స్త్రీ పురుషుల లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ముఖ్యంగా మెంతి ఆకు రెగ్యులర్‌గా తినడం వల్ల లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గ్యాస్, పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలగిస్తుంది. శ్వాస కోస వ్యాధుల్ని తగ్గుస్తుంది.

మెంతులలో కావలసినంత పీచు పదార్దాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం, విటమిన‌ కె కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి.

చలికాలంలో జీర్ణ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణకు మంచి ఫలితాలనిస్తుంది. మెంతి లో ప్రొటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా వుంటాయి. ఇవి వెంట్రుకల చక్కటి ఎదుగుదలకు తోడ్పడతాయి. కనుక, కేశ సౌందర్యం కొరే మహిళలకు ఈ ఆకుకూర ఒక వరంగా భావించాలి. సో ఇంకెదుకు ఆలస్యం మెంతి ఆకును మన వంటల్లో విరివిగా వాడుకుందాం..

Tags:    

Similar News