పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలని అస్సలు విస్మరించవద్దు..!

పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలని అస్సలు విస్మరించవద్దు..!

Update: 2022-10-13 15:30 GMT

పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలని అస్సలు విస్మరించవద్దు..!

Men Health Tips: చాలాసార్లు మనం బెడ్‌పై నుంచి లేచిన వెంటనే అధిక జ్వరం లేదా శరీరంలో నొప్పి మొదలవుతుంది. సాధారణంగా ఇలాంటి లక్షణాలని మనం విస్మరిస్తాము. కానీ ఈ సమస్య ప్రతి రోజు వస్తుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. నేటి వేగవంతమైన జీవితంలో పురుషుల జీవనశైలి చాలావరకు క్షీణించింది. దీని కారణంగా అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితిలో పురుషుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ లక్షణాలని అస్సలు విస్మరించకూడదు.

ఆకస్మిక తలనొప్పి

ఉదయం లేచిన తర్వాత లేదా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తలనొప్పి వస్తే ఇది సాధారణ కారణం కాదు. చాలా మంది పురుషులకు ఈ సమస్య ఉంటుంది. కానీ వారు వీటిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అలా చేయవద్దు. ఎందుకంటే ఈ నొప్పి మైగ్రేన్ వల్ల రావొచ్చు. కళ్లలో సమస్యల వల్ల ఏర్పడవచ్చు. అందువల్ల అకస్మాత్తుగా తలనొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

ఛాతీ నొప్పి

చాలా సార్లు పురుషులు ఆకస్మిక ఛాతీ నొప్పిని ఎదుర్కొంటారు. దీనివల్ల మీరు సరిగ్గా పని చేయలేకపోతే ఈ సమస్య గుండెపోటుకు కారణం అవుతుంది. అందువల్ల ఛాతీ నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించి చెకప్ చేయించుకోవడం ఉత్తమం.

కాళ్ళలో వాపు

చాలా సార్లు రోజంతా ఆఫీసులో కూర్చోవడం వల్ల కాళ్ళలో వాపు వస్తుంది. ఈ వాపునకు కారణం శరీరంలో రక్తం లేకపోవడం. అందువల్ల కాళ్ళలో ఎక్కువసేపు వాపు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే చాలా అనర్థాలు జరుగుతాయి.

Tags:    

Similar News