Health Tips: పురుషులకి ఖర్జూరం వల్ల అద్భుత ఫలితాలు.. అవేంటంటే..?
Health Tips: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి.
Health Tips: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. ముఖ్యంగా పురుషులకి దివ్య ఔషధమని చెప్పవచ్చు. పురుషులు ప్రతిరోజూ ఖర్జూరాన్ని తీసుకుంటే శారీరక బలం పెరుగుతుంది. ఎందుకంటే ఖర్జూరంలో క్యాలరీలు, ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు లభిస్తాయి. అదే సమయంలో ఖర్జూరాలను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఖర్జూరం ప్రయోజనాలు
ఖర్జూరం మెదడుని షార్ప్‌గా చేస్తుంది. ఇందులో విటమిన్ B ఉంటుంది. ఇది జ్జాపకశక్తిని పెంచుతుంది. ఖర్జూరం పురుషులలో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను పెంచడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఖర్జూరంలో ఈస్ట్రాడియోల్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. కాబట్టి పురుషులు ఖచ్చితంగా ఖర్జూరాన్ని తీసుకోవాలి. ఖర్జూరం చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. కాబట్టి దీని వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అందుకే మధుమేహంతో బాధపడే పురుషులు ఖర్జూరాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
ఖర్జూరం ఈ విధంగా తినండి
1. ఖర్జూరం రాత్రిపూట పాలతో కలిపి తినవచ్చు. పాలల్లో వేసి మరిగించిన తర్వాత తాగవచ్చు.
2. ఖర్జూరాలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు.
3. ఖర్జూరని మహిళలు కూడా తినవచ్చు. రక్తహీనతలో సహాయపడుతుంది.