Men Problems: శరీరంలో ఇవి లేకపోతే మగవారికి ఈ సమస్యలు..!

Men Problems: వివాహం తర్వాత ప్రతి మనిషి తండ్రి కావాలని కోరుకుంటాడు.

Update: 2022-06-17 14:30 GMT

Men Problems: శరీరంలో ఇవి లేకపోతే మగవారికి ఈ సమస్యలు..!

Men Problems: వివాహం తర్వాత ప్రతి మనిషి తండ్రి కావాలని కోరుకుంటాడు. కానీ నేటి ఆధునిక జీవితంలో ఉద్యోగ ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. దీంతో తండ్రి కావాలనే కల కూడా చెదిరిపోతోంది. మగవారిలో కొన్ని పోషకాల లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది. దీని గురించి తెలుసుకుందాం.

టెస్టోస్టెరాన్ అనేది పురుషుల వృషణాలలో ఉండే హార్మోన్. ఈ హార్మోన్ కారణంగా పురుషులలో లైంగిక కోరికలు ఏర్పడుతాయి. సంతానం విషయంలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే సరైన ఆహారంతో ఈ హార్మోన్నుపెంచుకోవచ్చు. ఈస్ట్రోజెన్ పురుషులు, స్త్రీలలో కనిపించే ఒక హార్మోన్. అయితే శరీరంలో ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల పురుషుల స్పెర్మ్ బలహీనంగా మారుతుంది.

ఈ కారణంగా పురుషులు తండ్రి కావడానికి కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాదు ఈ హార్మోన్ లేకపోవడం అనేది పురుషుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఈ హార్మోన్ను పెంచడానికి రోజు వ్యాయామం చేయాలి. తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవాలి. రోజూ కచ్చితంగా 8 గంటల నిద్ర పోవాలి. పురుషులకు శరీరంలో కాల్షియం లోపం ఉండటం మంచిది కాదు. కాల్షియం లేకపోవడం వల్ల పురుషుల స్పెర్మ్ నాణ్యత క్షీణిస్తుంది. దీని కారణంగా అతను తండ్రి కావడం కష్టమవుతుంది. అందువల్ల ఒక వ్యక్తి తండ్రి కావడానికి ఇబ్బంది పడితే అతను కాల్షియం అధికంగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. 

Tags:    

Similar News