Men Health: పురుషులకి గుండె సమస్యల ప్రమాదం ఎక్కువ.. ఇవే కారణాలు..!
Men Health: నేటికాలంలో చాలామంది ఎక్కువగా మానసిక ఒత్తిడి, టెన్షన్‌కి గురవుతున్నారు.
Men Health: నేటికాలంలో చాలామంది ఎక్కువగా మానసిక ఒత్తిడి, టెన్షన్‌కి గురవుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా వీటివల్ల పురుషులు చాలా ప్రమాదంలో పడుతున్నారు. అలసట, ఒత్తిడిని ఎదుర్కొనే పురుషులకి గుండె సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఒత్తిడి అనేది మహిళలని కూడా ప్రభావితం చేస్తుంది. కానీ పురుషులకి ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ పరిస్థితిలో పురుషులు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. మగవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా కొంతమంది పురుషులు అతిగా తినడం ప్రారంభిస్తారు. దీని కారణంగా వారు ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే లేదా వ్యాయామం చేయకపోతే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుకున్నవారవుతారని గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తే దగ్గరగా ఉన్న వారితో ఎక్కువగా మాట్లాడండి. దీనివల్ల మీ గుండె భారం తగ్గుతుంది. మీరు మరింత ఆందోళన చెందుతుంటే ఉదయాన్నే నిద్రలేచి యోగా, ధ్యానం చేయండి.
బయటి ఆహారాన్ని తక్కువగా తినండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, అలసటను దూరం చేసుకోవచ్చు. పురుషులు మనస్సును రిలాక్స్‌గా ఉంచుకోవడానికి సమతుల్య భోజనం తీసుకోండి. నచ్చిన పనులను మాత్రమే చేయండి. దీనివల్ల లోపల నుంచి సంతోషంగా ఉంటారు. మగవారి మనసులో నిత్యం రకరకాల అంతర్మథనం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఎక్కువగా కుటుంబంతో గడపడానికి ప్రయత్నించండి. దీనివల్ల టెన్షన్ తగ్గించుకోవచ్చు.