Health Tips: ఎండుద్రాక్ష నీటిలో ఔషధ గుణాలు.. పరగడుపున తాగితే అద్భుత ఫలితాలు..!

Health Tips: ఎండుద్రాక్షని ఎక్కువగా స్వీట్లు, తియ్యటి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.

Update: 2023-04-01 01:30 GMT

Health Tips: ఎండుద్రాక్ష నీటిలో ఔషధ గుణాలు.. పరగడుపున తాగితే అద్భుత ఫలితాలు..!

Health Tips: ఎండుద్రాక్షని ఎక్కువగా స్వీట్లు, తియ్యటి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు వీటిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎండుద్రాక్షలో పోషకాలకి కొరత లేదు. ఇందులో ఐరన్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, కాపర్ పుష్కలంగా ఉంటాయి. చాలా మంది డైటీషియన్లు వీటిని నానబెట్టి తినమని సూచిస్తారు. ఇది మానసిక ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా చెబుతారు. అలాగే బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో వైరల్ వ్యాధుల వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం చాలా ముఖ్యం. ఎండుద్రాక్ష నీరు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. దీని కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు బాగా తగ్గుతాయి.

శరీరం డిటాక్స్‌

శరీరంలో ఉండే విష పదార్థాలు అధికంగా పేరుకుపోతే అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. నిత్యం ఎండుద్రాక్ష నీటిని తాగే వారి శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఎండుద్రాక్ష నీటిని ఎలా సిద్ధం చేయాలి?

ఎండుద్రాక్ష నీటిని సిద్ధం చేయడానికి ఒక గిన్నెలో గ్లాసు నీటిని పోసి స్టవ్‌పై మరిగించాలి. తర్వాత అందులో ఎండు ద్రాక్ష వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం నిద్ర లేవగానే వడగట్టి ఖాళీ కడుపుతో తాగాలి. ప్రతిరోజు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Tags:    

Similar News