Health Tips: మానసిక ఒత్తిడి ఈ ప్రాణాంతకమైన వ్యాధికి కారణం అవుతుంది జాగ్రత్త..!

Health Tips: మానసిక ఒత్తిడి అనేది మనస్సుకు సంబంధించిన వ్యాధి.

Update: 2023-02-15 15:30 GMT

Health Tips: మానసిక ఒత్తిడి ఈ ప్రాణాంతకమైన వ్యాధికి కారణం అవుతుంది జాగ్రత్త..!

Health Tips: మానసిక ఒత్తిడి అనేది మనస్సుకు సంబంధించిన వ్యాధి. ఇందులో ఒక వ్యక్తి ఏ పనిపైన ఏకాగ్రత చూపలేడు. అతని పని సామర్థ్యంపై నెగటివ్‌ ప్రభావం ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల పరిశోధనలలో తేలింది. అనేక పరిశోధనలు, నివేదికలు మానసిక ఒత్తిడి, మధుమేహం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇది ఎల్లప్పుడూ మధుమేహానికి కారణం కానప్పటికీ ఇది వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందనేది మాత్ర వాస్తవం.

మానసిక ఒత్తిడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. ఇది అనేక వ్యాధులకి కారణం అవుతుంది. ఆయుర్వేదంలో మానసిక ఒత్తిడి, మధుమేహం మధ్య సంబంధం గురించి తెలిపారు. ఇటీవలి పరిశోధన ఈ ఆలోచనలకు మద్దతు ఇచ్చింది. వాటి మధ్య ఉన్న సంబంధాలపై మరింత సమాచారాన్ని సేకరించింది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్, కార్టికోట్రోపిన్ స్థాయిలు పెరుగుతాయి. హార్మోన్ స్థాయిలలో ఈ పెరుగుదల ఆందోళన, మానసిక రుగ్మతలకు దారితీస్తుంది.

అధిక ఒత్తిడి వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది సరిగ్గా నిద్రపోలేరు. దీనివల్ల శరరీంలో అనేక మార్పులు జరుగుతాయి. మధుమేహం నివారణలలో యోగా కూడా ఉంటుంది. రోజూ కొన్ని యోగాసనాలు వేయడం వల్ల లాభాలు పొందవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆసనాలు, ప్రాణాయామం చేయడంతో పాటు ధ్యానం కూడా చేయాలి. అంతే కాకుండా యోగా చేయడం వల్ల జీవక్రియలు సక్రమంగా పనిచేసి వ్యాధులకు దూరంగా ఉంటారు.

మధుమేహం లక్షణాలు

1.తరచుగా మూత్ర విసర్జన

2.అధిక ఆకలి, దాహం

3.దృష్టి కోల్పోవడం

4.విపరీతమైన అలసట

5.ఆకస్మిక బరువు నష్టం

6.చిరాకు

7.ఆలస్యంగా గాయం నయం

Tags:    

Similar News