Coconut Oil: కొబ్బరినూనెతో ముఖంపై ముడతలకి చెక్ పెట్టండి..!
Coconut Oil: అందమైన ముఖం ఎవరికి ఇష్టం ఉండదు.. అందుకే ఆడవారు అన్ని రకాల చిట్కాలను ట్రై చేస్తారు.
Coconut Oil: అందమైన ముఖం ఎవరికి ఇష్టం ఉండదు.. అందుకే ఆడవారు అన్ని రకాల చిట్కాలను ట్రై చేస్తారు. అలాంటి వారికి కొబ్బరినూనె కూడా చాలా మేలు చేస్తుంది. వృద్ధాప్యంతో పాటు ముఖంపై వచ్చే ముడతలని తొలగిస్తుంది. కొబ్బరి నూనె ముఖానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఈ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె సీరంలా పనిచేస్తుంది. ఈ నూనెను ముఖానికి రాసుకుంటే కాంతి పెరుగుతుంది. వాస్తవానికి కొబ్బరి నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ముఖానికి రాసుకోవచ్చు. ముఖంపై ముడతల సమస్య ఉంటే ఖచ్చితంగా కొబ్బరి నూనెను రాయాలి. ఈ నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే ముడతలు తొలగిపోతాయి.
వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మంది ముఖం పొడిబారుతుంది. ఈ పరిస్థితిని తొలగించాలంటే కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఇది మీ ముఖంపై తేమను నిలుపుతుంది. కాలుష్యం, తప్పుడు ఆహారం కారణంగా సాధారణంగా ముఖంపై వివిధ రకాల మచ్చలు ఏర్పడుతాయి. వాటిని వదిలించుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో ముఖానికి మర్దన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.