Bad Breath: ఈ మూడు అవయవాలు పనిచేయకపోయినా నోటినుంచి దుర్వాసన..!

Bad Breath: ఈ మూడు అవయవాలు పనిచేయకపోయినా నోటినుంచి దుర్వాసన..!

Update: 2022-10-29 04:49 GMT

Bad Breath: ఈ మూడు అవయవాలు పనిచేయకపోయినా నోటినుంచి దుర్వాసన..!

Bad Breath: ఎవరి నోటి వాసన వారికి సరిగ్గా తెలియదు. దీనివల్ల పక్కన ఉండేవారు చాలా ఇబ్బంది పడుతారు. దంతాలు,నోరు సరిగ్గా శుభ్రం చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం.సాధారణంగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తే ఎలాంటి వాసన ఉండదు. అయితే కొంతమంది బద్ధకంగా వ్యవహిరిస్తారు. దీని వల్ల నోటిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు దుర్వాసన వస్తోంది. అయితే నోటి వాసన అనేక ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది. శరీరంలోని అవయవాలలో సమస్య ఉంటే అది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1.ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. వాస్తవానికి ఊపిరితిత్తులలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శ్లేష్మం బయటకు రావడం ప్రారంభమవుతుంది. అది దుర్వాసనగా ఉంటుంది. దీని కారణంగా వాసన వస్తుంది.

2. లివర్ వ్యాధి

లివర్ వ్యాధి కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. కాలేయం మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కానీ అలా చేయలేనప్పుడు రక్తంలో విషపదార్ధాలు పెరుగుతాయి. దీని కారణంగా నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది.

3. కిడ్నీవ్యాధి

మీకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే నోరు పొడిబారడం మొదలవుతుంది. కిడ్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు యూరియా సులువుగా ఫిల్టర్ అవుతుంది. కానీ కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే యూరియా ఫిల్టర్ చేయలేక పోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది.

4. ఇతర కారణాలు

ఈ సమస్యలన్నీ కాకుండా ఇతర కారణాలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు మధుమేహ వ్యాధి ఉన్నప్పుడు కూడా దుర్వాసన వస్తుంది. ఎందుకంటే నోటి నుంచి అసిటోన్ వాసన వస్తుంది. దీని వెనుక కారణం రక్తంలో కీటోన్ల స్థాయి పెరుగుదల అని చెప్పవచ్చు.

Tags:    

Similar News