Skin Care Tips: తేనెని ఇలా ఉపయోగిస్తే ముఖం కాంతివంతం.. యవ్వనంగా కనిపిస్తారు..!
Skin Care Tips: వేసవిలో ఎండవల్ల ముఖం జిడ్డుగా తయారవుతుంది. చర్మంపై టానింగ్ పేరుకుపోతుంది.
Skin Care Tips: వేసవిలో ఎండవల్ల ముఖం జిడ్డుగా తయారవుతుంది. చర్మంపై టానింగ్ పేరుకుపోతుంది. అంతేకాదు కొన్నిసార్లు వడదెబ్బని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో ముఖాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేదంటే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి సమయంలో తేనె ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎల్లప్పుడు ముఖం కాంతివంతంగా ఉంటుంది. ముఖంపై నుంచి టానింగ్, మచ్చలు, మొటిమలు తొలగించడంలో సహాయపడుతుంది. అయితే దీనిని ఏ విధంగా ఉపయోగించాలో ఈరోజు తెలుసుకుందాం.
బొప్పాయి, తేనె
ఇందుకోసం 2 చెంచాల బొప్పాయి గుజ్జును 2 చెంచాల తేనెతో కలిపి పేస్టులా చేయాలి. తర్వాత దానిని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి కడుక్కోవాలి. బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీనివల్ల ముఖంపై ఉండే టానింగ్ తొలగిపోతుంది. ఇది మీ ఛాయను మెరుగుపరుస్తుంది.
బియ్యపు పిండి, పాలు
ఇందుకోసం 2 స్పూన్ల బియ్యప్పిండికి చల్లటి పాలు జోడించి పేస్టులా చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి 20-25 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీని కారణంగా ముఖంపై ఉండే టానింగ్ సులభంగా తొలగిపోతుంది. మరోవైపు పాలు ముఖాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి.
కాఫీ,టొమాటో
ఇందుకోసం 2 టమోటా ముక్కలను తీసుకోవాలి. తర్వాత అందులో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ కాఫీ వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి సుమారు 15-20 నిమిషాల ఉంచి కడిగేయాలి. టొమాటోలో బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీనిని ముఖంపై ఉపయోగించడం వల్ల టానింగ్ తొలగిపోతుంది.
బంగాళదుంప
ఇందుకోసం బంగాళాదుంపను సన్నగా తురిమి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి. బంగాళాదుంపలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న టానింగ్‌ను కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ మాస్క్‌ని వారానికి 2 నుంచి 3 సార్లు ప్రయత్నించడం ఉత్తమం.