Life Style: చర్మ సౌందర్యానికి బచ్చలి ఆకులు
Life Style: బచ్చలి కూరలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
LifeStyle: ప్రకృతి ప్రసాదించే ఔషధాలుగా ఈ ఆకుకూరలను చెప్పవచ్చు. వాటిలో బచ్చలి కూర ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందే..దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బచ్చలిలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. గ్రామాల్లో ఏ ఇంటి ముందు చూసినా ఏ చిన్నా ఆధారం దొరిగినా పైకి పాకుతూ బచ్చలి తీగ కనిపిస్తుంది. పట్టణాల్లో అయితే బజారులో కొనాల్సిందే. బచ్చలి కూర పప్పు, టమాట బచ్చలి, బచ్చలికూర పచ్చడి ఇలా రకరకాలుగా బచ్చలికూరను వండుకోవచ్చు. అదెలానో మన "లైఫ్ స్టైల్"లో చూద్దాం
బచ్చలికూరలో కాల్సియం, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే బీటాకెరాటిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇందులో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది. ఊపిరి తిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది.
కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే చర్మం మీ కాంతిమంతం అవుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. శరీరంలో కొవ్వు తగ్గడానికి బచ్చలికూర మంచి ఆహారం. బచ్చలి కూర తీసుకుంటే కీళ్లనొప్పుల సమస్యలు, పైల్స్ సమస్యలు రావు. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. మూత్రవిసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజూ బచ్చలికూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత (నియోనియా) సమస్య తగ్గుతుంది. బచ్చలి ఆకులను రోజుకు రెండు పూటలా నమిలి మింగుతూ ఉంటే నాలుక మీద ఏర్పడే పొక్కులు తగ్గిపోతాయి. బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు తగ్గుతాయి. కాలిన మచ్చలు మాయం అవుతాయి.
ఆకులలోని జిగట పదార్థం మల మద్దకాన్ని నివారిస్తుంది. బచ్చలిలో ఉండే సాఫోనిన్ అనే పదార్థం క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది. బచ్చలి కూర తినడం ద్వారా తరుచుగా వచ్చే దగ్గు, పైత్యం, అతిదాహం సమస్యలు తీరతాయి. బచ్చలికూర శరీరంలోని వేడిని తగ్గిస్తోంది. కొన్ని ఆకులు నూరి కణతకు పెడితే.. తలలోని వేడి కూడా తగ్గుతుంది.