Health Tips: జింక్ లోపిస్తే శరీరానికి పెద్ద ఎఫెక్ట్.. నివారించడానికి వీటిని డైట్‌లో చేర్చుకోండి..!
Health Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు అవసరం. ఇందులో జింక్ కూడా ఒకటి. ఇది లోపిస్తే శరీరం చాలా బలహీనంగా మారుతుంది.
Health Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు అవసరం. ఇందులో జింక్ కూడా ఒకటి. ఇది లోపిస్తే శరీరం చాలా బలహీనంగా మారుతుంది. మీరు అనేక వ్యాధుల బారిన పడుతారు. జింక్ శరీరంలో సొంతంగా ఉత్పత్తి కాదు. దీని కోసం రోజువారీ డైట్‌లో కొన్ని ప్రత్యేక ఆహారాలను చేర్చుకోవాలి. ఏయే ఆహారపదార్థాలు తింటే మనకు పుష్కలంగా జింక్ లభిస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.
జింక్ లోపం సమస్యలు
బరువు తగ్గడం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, జుట్టు రాలడం, ఆలస్యమైన గాయం మానడం, ఆకలి లేకపోవడం, రుచి, వాసన తగ్గడం, తరచుగా విరేచనాలు కావడం ఉంటాయి.
1.గుడ్డు పచ్చసొన
గుడ్డులోని పసుపు భాగాన్ని పచ్చసొన అంటారు. కొంతమంది గుడ్డులోని తెల్లసొనను వేరు చేసి కేవలం ప్రోటీన్ పొందడానికి వైట్ మాత్రమే తింటారు. పచ్చసొన తింటే జింక్‌తో పాటు పీచు, విటమిన్ బి6, విటమిన్ బి12, థయామిన్, ఫోలేట్, పాంథోనిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ శరీరానికి అందుతాయి.
2. పెరుగు
మనం రోజూ పెరుగును ఆహారంతో తీసుకుంటాం. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఈ పాల ఉత్పత్తిలో జింక్ కూడా ఉంటుంది.
3. వెల్లుల్లి
వెల్లుల్లి వాసన చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఇందులో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, అయోడిన్ అందుతాయి.
4. జీడిపప్పు
జీడిపప్పు చాలా మంది ఇష్టపడే డ్రై ఫ్రూట్. ఇందులో జింక్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో దీన్ని ఎక్కువగా తింటారు.