Watermelon: మంచిదే కదా అని అతిగా తింటే ఆస్పత్రికే..!

Watermelon: పుచ్చకాయ అంటే దాదాపు అందరికి ఇష్టమే. వేసవి కాలం రాగానే మార్కెట్‌లోకి పుచ్చకాయ రావడం మొదలవుతుంది.

Update: 2023-05-19 12:00 GMT

Watermelon: మంచిదే కదా అని అతిగా తింటే ఆస్పత్రికే..!

Watermelon: పుచ్చకాయ అంటే దాదాపు అందరికి ఇష్టమే. వేసవి కాలం రాగానే మార్కెట్‌లోకి పుచ్చకాయ రావడం మొదలవుతుంది. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాదు ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉంటాయి. పుచ్చకాయలో ఉండే నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అదే సమయంలో ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

డయాబెటిస్ పేషెంట్లు

డయాబెటీస్‌ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు పుచ్చకాయను తక్కువగా తీసుకుంటే మంచిది. ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే సహజ చక్కెర డయాబెటిస్‌తో బాధపడేవారకి ఇబ్బందులు తీసుకువస్తుంది. దీనిలో గ్లైసెమిక్‌ చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.

రోజూ ఆల్కహాల్ తాగే వ్యక్తులు

రోజూ ఆల్కహాల్ తాగే వ్యక్తులు ఎక్కుగా పుచ్చకాయ తీసుకుంటే మంచిది కాదు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఉండే లైకోపీన్ ఉంటుంది. ఇది ఆల్కహాల్‌తో చర్య జరుపుతుంది. దీని కారణంగా కాలేయ వాపు సమస్య వచ్చే అవకాశం ఉంది.

గుండె సమస్యలు

పుచ్చకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలు, కండరాలను బలంగా చేస్తుంది. అయినప్పటికీ అధికంగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఉంటుంది.

జీర్ణ సమస్యలు

పుచ్చకాయ అతిగా తీసుకోవడం వల్ల విరేచనాలు, కడుపుఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో చక్కెర సమ్మేళనం అయిన సార్బిటాల్ ఉంటుంది. ఇది గ్యాస్‌ సమస్యలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

Tags:    

Similar News