Thyroid Disease: చిన్న వయసులోనే థైరాయిడ్‌ రావడానికి కారణాలేంటి.. లక్షణాలు తెలుసుకోండి..!

Thyroid Disease: నేటి ఆధునిక రోజుల్లో ప్రతి ఒక్కరి జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దీంతో చిన్నవయసులోనే చాలా వ్యాధులు సంభవిస్తున్నాయి.

Update: 2024-01-13 15:00 GMT

Thyroid Disease: చిన్న వయసులోనే థైరాయిడ్‌ రావడానికి కారణాలేంటి.. లక్షణాలు తెలుసుకోండి..!

Thyroid Disease: నేటి ఆధునిక రోజుల్లో ప్రతి ఒక్కరి జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దీంతో చిన్నవయసులోనే చాలా వ్యాధులు సంభవిస్తున్నాయి. అందులో ఒకటి థైరాయిడ్‌. ఈ రోజుల్లో టీనేజీ యువత కూడా థైరాయిడ్‌ బారినపడుతోంది. ఒకప్పుడు థైరాయిడ్ 50 ఏళ్ల తర్వాత వచ్చేది. వీటిలో 60 శాతానికిపైగా కేసులు మహిళల్లోనే ఉండగా.. ఇప్పుడు చరిత్రను తిరగరాస్తోంది. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు గుర్తించలేము. దీంతో ఈ వ్యాధి ముదురతూ ఉంటుంది. చిన్న వయస్సులోనే థైరాయిడ్ ఎందుకు సంభవిస్తుందో దాని ప్రారంభ లక్షణాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

థైరాయిడ్‌ హార్మోన్‌ పనితీరు సరిగా లేనప్పుడు ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో రెండు రకాలు. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా పనిచేస్తే హైపోథైరాయిడిజం అంటారు, థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్‌గా మారినప్పుడు దానిని హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ ఎక్కువ లేదా తక్కువ ఈ వ్యాధికి కారణమవుతుంది. ఇంతకు ముందు ఈ సమస్య వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సు అనేది మారిపోయింది. 30 ఏళ్లు పైబడిన వారు థైరాయిడ్‌ని చెక్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో ఆటో ఇమ్యూన్ కారకాల వల్ల చిన్న వయసులోనే ఈ వ్యాధి వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే పరిస్థితి ఇది. దీని వల్ల థైరాయిడ్ అండర్ లేదా ఓవర్ యాక్టివ్‌గా మారుతుంది. కొన్ని సందర్భాల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, శరీరంలో పోషకాలు లేకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణం. ప్రస్తుతం ప్రజల్లో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న వయస్సులో, ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత జీవిత సమస్యల కారణంగా ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

Tags:    

Similar News