Green Coffee Benefits: గ్రీన్ కాఫీ ఎప్పుడైనా తాగారా..!ఈ 4 సమస్యలకు దివ్య ఔషధం..
Green Coffee Benefits: కాఫీలో ఆందోళన తగ్గించే గుణాలు ఉంటాయి.. మెదడుకి ఉపశమనం కలిగిస్తుంది.
Green Coffee Benefits: ఎవరైనా టెన్షన్‌గా ఉన్నా, ఒత్తిడికి లోనైనా వెంటనే ఒక కప్పు కాఫీ తాగుతారు. అది వారికి మంచి రిలాక్స్ నిస్తుంది. ఎందుకంటే కాఫీలో ఆందోళన తగ్గించే గుణాలు ఉంటాయి. మెదడుకి ఉపశమనం కలిగిస్తుంది. అయితే మార్కెట్లో అనేక రకాల కాఫీలు అందుబాటులో ఉన్నాయి. అవి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలకు కలిగి ఉంటాయి. అందులో గ్రీన్ కాఫీ ఒకటి. సాధారణ కాఫీలా కాకుండా, గ్రీన్ కాఫీ గింజలు కాల్చబడవు. పూర్తిగా పచ్చిగా ఉంటాయి. అందువల్ల ఇందులో గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే రసాయనం ఉంటుంది. ఇందులో కాల్చిన కాఫీ కంటే తక్కువ కెఫీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
1. బీపీని నియంత్రిస్తుంది గ్రీన్ కాఫీ హై బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. బీపీని పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
2. క్యాన్సర్ నిరోధిస్తుంది గ్రీన్ కాఫీ గింజలలో అవసరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. అధ్యయనాల ప్రకారం గ్రీన్ కాఫీ గింజలలోని క్లోరోజెనిక్ యాసిడ్ ట్యూమర్ సెల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.
3. బరువు తగ్గిస్తుంది గ్రీన్ కాఫీ గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వును కరిగిస్తుంది. గ్రీన్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన బరువును మెయింటన్ చేయడానికి సహాయపడుతుంది.
4. రక్తంలో చక్కెర నియంత్రణ గ్రీన్ కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు.