Health News: ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఈ జ్యూస్‌ అద్భుతం.. ఎలాగంటే..?

Health News: ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఈ జ్యూస్‌ అద్భుతం.. ఎలాగంటే..?

Update: 2022-02-02 03:37 GMT

Health News: ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఈ జ్యూస్‌ అద్భుతం.. ఎలాగంటే..?

Health News: కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మరోవైపు చాలామంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో గంటల తరబడి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల ముందు గడుపుతున్నారు. సమయం చూసుకోకుండా పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తి క్షీణించి వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు బద్దకం, థైరాయిడ్, మధుమేహం, కీళ్ల నొప్పులు, బిపి మొదలైన అన్ని వ్యాధులూ చుట్టుముడతాయి. అందుకే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ముఖ్యం. అలా వీలుకానప్పుడు ఈ ఒక్క పానీయంతో అన్ని సమస్యలు దూరం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఈ కష్టాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ మంచి ఆహారంతోపాటు పాలు, ఖర్జూరం, మఖానాతో చేసిన పానీయాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీ శరీరం బలహీనత, అలసట సమస్యను తొలగించడంతో పాటు ఇది శరీరాన్ని దృఢంగా చేస్తుంది. అన్ని వ్యాధులతో పోరాడటానికి శక్తిని ఇస్తుంది. ఈ పానీయం చేయడానికి, 4 బాదం, 4 ఖర్జూరాలు, కొన్ని మఖానాలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం లేవగానే వాటిని గ్రైండర్‌లో పట్టాలి. తరువాత ఈ మిశ్రమంలో ఒక గ్లాసు పాలను వేసి మళ్లీ 5 నిమిషాలు గ్రైండర్‌లో పట్టాలి. అన్నీ మిక్స్ అయ్యాక ఈ డ్రింక్ తాగాలి. మీరు తీపి కావాలనుకుంటే కొంచెం తేనెను కలుపుకోవచ్చు. కానీ చక్కెరను అస్సలు ఉపయోగించవద్దు.

ఈ జ్యూస్‌ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ శరీరం యొక్క బలహీనత తొలగిపోతుంది. ఖర్జూరంలో కాల్షియం, ఐరన్, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. శరీరం బలహీనత, అలసటను తొలగించడంతో పాటు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఉండదు. ఇది ఎముకలు, దంతాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జ్యూస్‌ ద్వారా ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలే కాకుండా శరీరానికి చాలా అవసరమైన సూక్ష్మపోషకాలు శరీరానికి అందుతాయి.

Tags:    

Similar News