జలుబు సమయంలో శ్వాస తీసుకోవడం చాలా కష్టం.. ఈ చిట్కాలు పాటిస్తే చాలా సులభం..
జలుబు సమయంలో శ్వాస తీసుకోవడం చాలా కష్టం.. ఈ చిట్కాలు పాటిస్తే చాలా సులభం..
Health Tips: అధిక చలి ఉన్నప్పుడు లేదా జలుబు చేసినప్పుడు సాధారణంగా ముక్కు మూసుకుపోతుంది. శ్వాస తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిద్రించడం చాలా కష్టతరం అవుతుంది. అయితే మూసుకుపోయిన ముక్కును అధిగమించడానికి అనేక నివారణలు ఉన్నాయి. సాధారణంగా జ్వరం లేదా జలుబు సమయంలో మూసుకుపోయిన ముక్కు ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. అలాంటి సమయంలో ఎవరితోనైనా మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది. కానీ దాని నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఖచ్చితంగా రోజువారీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ సమస్యను వదిలించుకోవడానికి ఆవిరి ప్రక్రియ బాగా పనిచేస్తుంది. మీరు ఏదైనా పాత్రలో వేడి నీటిని కాచి ఆవిరిని తీసుకోవచ్చు. ఇది మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం ద్వారా కూడా దీనిని వదిలించుకోవచ్చు. దీని కోసం మీరు కాఫీ లేదా టీ వంటి వేడి పానీయాలు తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీ నుదిటిపై వేడి నీటిలో నానబెట్టిన టవల్‌ను పెట్టుకోవచ్చు. గోరువెచ్చని నీటితో తడిపి నుదుటిపై పెట్టుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
మూసుకుపోయిన ముక్కు నుంచి బయటపడటానికి పుదీన కూడా మేలు చేస్తుంది. ఈ డ్రింక్‌ని చాలా పానీయాలలో కలుపుకొని తీసుకోవచ్చు. అంతేకాదు పుదీన రసాన్ని ఛాతీపై పూసిన ఉపశమనం ఉంటుంది. అలాగే ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఒక పక్కకు తిరిగి పడుకోకుండా తరుచుగా మారుస్తూ ఉండాలి. ఇలా అయితే శ్వాస తీసుకోవడం కొంచెం సులువుగా ఉంటుంది. అలాగే చల్లటి ఆహారాలకి దూరంగా ఉంటే మంచిది.
ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.