Diabetes Patients: షుగర్ పేషెంట్లు చక్కెరకు బదులు ఈ రెండు వాడితే బెటర్..
Diabetes Patients: మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర చాలా ప్రమాదకరం. అందుకే వైద్యులు చక్కెరని స్లో పాయిజన్ అంటారు.
Diabetes Patients: మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర చాలా ప్రమాదకరం. అందుకే వైద్యులు చక్కెరని స్లో పాయిజన్ అంటారు. అయితే డయాబెటిక్ పేషెంట్లకు మాత్రం ఇది విషంతో సమానం. షుగర్ లేదా షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ 70 అంటే అది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వేగంగా రక్తంలో కలిసిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిని విపరీతంగా పెంచుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ఎ క్కువగా ఉండే వస్తువులు మన ఇన్సులిన్ హార్మోన్ మీద ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయి. అది మన ఇన్సులిన్ హార్మోన్నుని ప్రేరేపిస్తుంది.
కానీ డయాబెటిక్ పేషెంట్లకు ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్లో చక్కెరకు బదులు వేరే పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. అంతేకాదు ఇన్సులిన్‌పై కూడా ఎలాంటి చెడు ప్రభావం చూపవు. అయితే ఈ చక్కెర ప్రత్యామ్నాయాలు సహజమైనవి కానప్పటికీ వాటిని చాలా జాగ్రత్తగా, సమతుల్య మొత్తంలో తీసుకోవాలి. చక్కెర లేదా పంచదారకు మంచి ప్రత్యామ్నాయంగా ఉండే అలాంటి కొన్ని స్వీటెనర్ల గురించి తెలుసుకుందాం.
1. స్టెవియా
ఇది చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం. ఇది స్టెవియా రెబాడియానా అనే చెట్టు నుంచి తయారు చేస్తారు. ఇది రుచిలో చాలా తీపిగా ఉంటుంది. ఈ చెట్టు ఎక్కువగా బ్రెజిల్, పరాగ్వే దేశాలలో ఉంటాయి. స్టెవియా గ్లైసెమిక్ ఇండెక్స్‌లో సున్నా, అంటే దాని వినియోగం రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పెంచదు. అందుకే ఇది చక్కెరకు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు.
2. ఎరిథ్రిటాల్
ఇది చక్కెర ఆల్కహాల్. ఇది రసాయన ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. మొక్కజొన్నను పులియబెట్టడం, దానికి కొన్ని ఎంజైమ్‌లను కలపడం ద్వారా ఎరిథ్రిటాల్ తయారవుతుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లకు చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం కూడా. కీటో కుక్కీలు, కీటో చాక్లెట్, షుగర్ పేషెంట్ల ఆహార ఉత్పత్తులలో ఎరిథ్రిటాల్ అనే పేరు తరచుగా వినిపిస్తుంది. ఇది చక్కెర లాగా తీపిగా ఉంటుంది. కానీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు ఎందుకంటే దాని గ్లైసెమిక్ సూచిక సున్నా.
3. జాగ్రత్తలు
ఈ రెండూ రసాయన చక్కెరకు మంచి ప్రత్యామ్నాయాలు కావచ్చు కానీ ఇవి చాలా సమతుల్య మొత్తంలో తినాలి. ఇది కూడా ఒక రకమైన రసాయనం కాబట్టి అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ మొదలైన సమస్యలు వస్తాయి. అందువల్ల తక్కువ పరిమాణంలో తీసుకుంటే అది మీకు హాని కలిగించదు.