Raw Milk Side Effects: పచ్చిపాలు తాగితే అనర్థాలే..!
Raw Milk Side Effects: పాలను సంపూర్ణ ఆహారంగా చెబుతారు.
Raw Milk Side Effects: పాలను సంపూర్ణ ఆహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో దాదాపు అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు పాలని తాగాలని సూచిస్తారు. అందుకే చాలామంది పాలని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. అయితే పచ్చి పాలు తాగడం గురించి మాట్లాడినప్పుడు ఆరోగ్యానికి మేలు జరుగుతుందా.. హానిజరుగుతుందా.. అని చర్చ జరుగుతోంది.. ఈ రోజు ఆ రెండింటిలో ఏది నిజమో తెలుసుకుందాం.
పచ్చి పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనేది నిజం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, USహెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం.. పచ్చి పాలలో ఎస్చెరిచియా కోలా, లిస్టెరియా, సాల్మోనెల్లా వంటి అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఎవరైనా పచ్చి పాలు తాగడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఎదురవచ్చు. పచ్చి పాలలో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి హాని కలిగించే విరేచనాలు, ఆర్థరైటిస్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను కలిగిస్తుంది. దీని వినియోగం శరీరంలోని యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
పచ్చి పాలు తాగడం హానికరం ఎందుకంటే జంతువుల పాలు తీస్తున్నప్పుడు పొదుగు శుభ్రంగా ఉండదు. అంతే కాకుండా శుభ్రమైన చేతులు, శుభ్రమైన పాత్రలను ఉపయోగించారో లేదో ఎవ్వరికి తెలియదు. దీనివల్ల పాలలో మురికి పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాలను మరిగించిన తర్వాతే తాగాలి. అప్పుడే అందులో ఉండే బాక్టీరియా చనిపోతుంది. శరీరానికి ఎటువంటి హాని జరగదు.