Health Tips: నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుందా.. దీని వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకోండి..!

Health Tips: రోజూ ఉదయం, సాయంత్రం నోరు శుభ్రం చేసుకోకపోతే నోటి దుర్వాసన వస్తుంది.

Update: 2023-02-21 16:00 GMT

Health Tips: నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుందా.. దీని వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకోండి..!

Health Tips: రోజూ ఉదయం, సాయంత్రం నోరు శుభ్రం చేసుకోకపోతే నోటి దుర్వాసన వస్తుంది. కానీ రోజూ బాగా బ్రష్ చేసుకున్నా కూడా చాలామంది ఈ సమస్యని ఎదుర్కొంటారు. దీని కారణంగా మీరు స్నేహితులకు దగ్గరగా కూర్చోవడానికి సిగ్గుపడతారు. కానీ దీని వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్నప్పుడే మీరు నోటి దుర్వాసనని కంట్రోల్‌ చేయగలరు. అవేంటో తెలుసుకుందాం.

1. తక్కువ నీరు తాగడం

శరీరంలో ఎక్కువ భాగం నీరు మాత్రమే ఉంటుంది. కాబట్టి శరీరంలో నీటి కొరత ఉండకూడదు. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది కాకుండా నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా పొడి నోటిలో సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు ఆహారం పళ్లలో ఇరుక్కుపోయి చెడు వాసనకి కారణం అవుతుంది. అందుకే తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. తిన్న తర్వాత ఉప్పు, గోరువెచ్చని నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి. ఇది నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది

2. యాంటీ డిప్రెషన్‌కు ఔషధం

రాత్రిపూట నిద్రపోని వారు లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు మందులు వేసుకుంటారు. ఈ మాత్రలు నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. ఇందుకోసం లిక్విడ్ డైట్ తీసుకుంటే మంచిది. కొబ్బరి లేదా నిమ్మకాయ నీళ్లను తీసుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి టెన్షన్‌కి గురికావొద్దు. దీంతో మానసిక ప్రశాంతతతోపాటు నోటి దుర్వాసన కూడా పోతుంది.

3. కాఫీ

భారతదేశంలో కాఫీ ప్రియులకు కొరత లేదు. కానీ ఈ అలవాటు నష్టానికి కారణం అవుతుంది. ఈ పానీయంలో చాలా కెఫిన్ ఉంటుంది. ఇది మన శరీరం నుంచి నీటిని వేగంగా తొలగిస్తుంది. దీని అధిక వినియోగం కారణంగా నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా సూక్ష్మక్రిముల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇది దుర్వాసనకు కారణం అవుతుంది.

Tags:    

Similar News