Wheat Flour: గోధుమ పిండి కంటే వీటిలో అధికంగా ప్రొటీన్.. అవేంటంటే..?
Wheat Flour: భారతదేశంలో చాలామంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు.
Wheat Flour: భారతదేశంలో చాలామంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఎలాంటి ఆహారం తినాలనే దానిపై అవగాహన లేకపోవడమే. చాలామంది శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్ లాంటి ఆహారాలు తీసుకోరు. దీంతో తొందరగా నీరసించి వ్యాధులకి గురవుతారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మాంసం, గుడ్డు ప్రోటీన్ మూలం. కానీ చాలా మంది వ్యక్తులు శాఖాహారులు. వీటిని తినడానికి ఇష్టపడరు. కాబట్టి గోధుమ పిండికి బదులుగా మరికొన్ని పిండిలతో చేసిన రోటీలని తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో మీకు అవసరమైన ప్రొటీన్ లభిస్తుంది.
1. శనగపిండి
100 గ్రాముల శెనగపిండిలో 22 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఇది ప్రొటీన్ రిచ్ డైట్‌గా చెబుతారు. అంతేకాదు శెనగపిండిని కూరలలో కూడా ఉపయోగించవచ్చు. శెనగపిండితో లడ్డూలని కూడా తయారుచేసుకోవచ్చు. దీంతో తయారుచేసిన ఆహారపదార్థాలు తీసుకుంటే మీ శరీరానికి అవరసరమైన ప్రొటీన్ లభిస్తుంది. అందుకే కచ్చితంగా ఇది డైట్‌లో ఉండే విధంగా చూసుకోండి.
2. సోయా పిండి
సోయా పిండి మార్కెట్‌లో సులువుగా దొరుకుతుంది. ప్రోటీన్ కంటెంట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది 100 గ్రాములకు 52 గ్రాముల ప్రోటీన్‌ను ఇస్తుంది. సోయా పిండితో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే రోటీని తయారు చేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సులువుగా ముద్దకి రాదు. కాబట్టి కొంచెం గోధుమ పిండిని కలుపుకోవచ్చు. అప్పుడే చపాతీ మెత్తగా వస్తుంది. ఈ పిండి కూడా డైట్‌లో ఉండే విధంగా చూసుకోండి.