Health News: శరీరంలో మంచి కొలస్ట్రాల్ పెంచుకోండి.. ఈ జబ్బులని నివారించండి..!
Health News: శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి 'మంచి కొలెస్ట్రాల్' రెండోది 'చెడు కొలెస్ట్రాల్'.
Health News: శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి 'మంచి కొలెస్ట్రాల్' రెండోది 'చెడు కొలెస్ట్రాల్'. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభిస్తే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి చాలా మంది అనేక రకాల చర్యలు తీసుకుంటారు. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు. 'మంచి కొలెస్ట్రాల్'ని హెచ్‌డిఎల్ అని, 'చెడు కొలెస్ట్రాల్'ని ఎల్‌డిఎల్ అని అంటారు. మంచి కొలెస్ట్రాల్ మన గుండెకు మేలు చేస్తుంది. ఇది రక్తం నుంచి అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి వ్యాయామం చాలా ముఖ్యం. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. నడక, పరుగు, జాగింగ్, స్విమ్మింగ్ లేదా జిమ్‌కి వెళ్లడం ద్వారా వ్యాయామం చేయవచ్చు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ముందుగానే తయారు చేస్తారు. చాలా కాలం తర్వాత ఉపయోగిస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వులు ఇందులో ఉంటాయి. అందుకే వీటిని తినకూడదు.
ఎక్కువ స్వీట్లు తినడం మానుకోండి. ఎందుకంటే ఎక్కువ చక్కెర వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. కాబట్టి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. బరువు తగ్గడం కూడా చాలా ముఖ్యం. బరువు పెరిగితే మీరు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ధూమపానం చేయకూడదు. ఎందుకంటే ధూమపానం మీ శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.