Glowing Skin: గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే కచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!
Glowing Skin: అయితే స్కిన్ కేర్ విషయంలో డైట్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని చాలామందికి తెలియదు.
Glowing Skin: జీవితంలో ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని ఆరాటపడుతారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఖరీదైన చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటారు. మరికొంతమంది మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడాక్ట్స్ వాడుతారు. అయితే స్కిన్ కేర్ విషయంలో డైట్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని చాలామందికి తెలియదు. రోజువారీ డైట్‌లో కొన్ని ఆహారాలని చేర్చడం వల్ల మిమ్మల్ని మీరు అందంగా మార్చుకోవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
నిమ్మకాయ నీరు
చాలా మంది ఉదయం నిద్ర లేచిన తర్వాత నేరుగా టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇది సరైన పద్దతి కాదు. పరగడుపున నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయ నీటితో రోజుని ప్రారంభిస్తే అది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.
లైట్ ఫుడ్
ఉదయం టిఫిన్ మానేసేవారిలో మీరు ఒకరైతే ఈ ఎఫెక్ట్ ఆరోగ్యం, చర్మం రెండింటిపై పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పుడూ మానేయవద్దు. ప్రతిరోజూ లైట్‌ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
ABC జ్యూస్
మెరిసే చర్మం పొందాలంటే రోజూ ABC జ్యూస్ తాగాలి. ABC అంటే ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ రసం. దీన్ని తాగడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది.
పండ్లు తినాలి
రోజువారీ డైట్‌లో పండ్లు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి. కాబట్టి పండ్లను ప్రతిరోజూ తీసుకోవాలి.
పుష్కలంగా నీరు తాగాలి
ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే పుష్కలంగా నీరు తాగాలి. దీనివల్ల చర్మానికి మెరుపు వస్తుంది.