Thyroid Problems: థైరాయిడ్‌కి ఈ ఆహారాలతో చెక్ పెట్టండి..!

థైరాయిడ్ గ్రంథి తక్కువ పరిమాణంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంధి అధిక మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపర్ థైరాయిడిజం అంటారు.

Update: 2024-05-31 01:30 GMT

Health Tips: థైరాయిడ్‌కి ఈ ఆహారాలతో చెక్ పెట్టండి..!

Health Tips: నేటి రోజుల్లో చాలామంది థైరాయిడ్ వ్యాధికి గురవుతున్నారు. కానీ ఆలస్యంగా గుర్తిస్తున్నారు. థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు గొంత దగ్గర వాపు ఏర్పడుతుంది. దీనివల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మెడ కింది భాగంలో ఉండే చిన్న సీతాకోక చిలుక గ్రంధిని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఇది థైరాక్సిన్, ట్రైఅయోడోథైరోనిన్ అనే రెండు ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరం, పనితీరుకు చాలా అవసరం. ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ డైట్లో ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం.

థైరాయిడ్ గ్రంథి తక్కువ పరిమాణంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంధి అధిక మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ రెండు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే అది మీరు తీసుకున్న ఆహారంపై ఆధారపడి ఉంటుంది. థైరాయిడ్ వచ్చిన తర్వాత ఇబ్బందిపడేకంటే రాకుముందే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. థైరాయిడ్ రాకూడదంటే వివిధ రకాల పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు తినాలి. ప్రోటీన్ కోసం, చేపలు లేదా బీన్స్ వంటి తక్కువ కొవ్వు ఉన్నవాటిని ఎంచుకోవాలి. వంటలో ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాలి.

చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వులు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా విత్తనాలు, గింజలు, చిక్కుళ్లు తీసుకోవాలి. ఫైబర్ సరైన జీర్ణక్రియను మెయింటెన్ చేయడానికి సాయపడుతుంది. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు తినడం ద్వారా మీరు తగినంత మొత్తంలో ఫైబర్ పొందవచ్చు. అయోడిన్ మాత్రలు తీసుకోవడం లేదా అయోడిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం మంచిదికాదు. ఇది థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను దెబ్బతీస్తుంది. అయినప్పటికీ ఉప్పు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఇది శరీరాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే అని గుర్తించాలి. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News