Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బందులా.. ఆహారంలో ఈ 6 పండ్లను చేర్చండి.. కొవ్వోత్తిలా కరిగించేస్తాయ్..!

Bad Cholesterol: మారుతున్న జీవనశైలి ఆరోగ్యాన్ని నిరంతరం ఇబ్బందుల్లోకి నెడుతోంది.

Update: 2023-04-17 11:33 GMT

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బందులా.. ఆహారంలో ఈ 6 పండ్లను చేర్చండి.. కొవ్వోత్తిలా కరిగించేస్తాయ్..!

Bad Cholesterol: మారుతున్న జీవనశైలి ఆరోగ్యాన్ని నిరంతరం ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీని వల్ల అనేక రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే, చాలా అవయవాల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కొలెస్ట్రాల్ మొత్తం 200 mg/dL కంటే తక్కువగా ఉంటే, అది సాధారణమైనదిగా పరిగణిస్తుంటారు. ఇంతకంటే ఎక్కువైతే కొలెస్ట్రాల్‌ సమస్య వస్తుంది.

కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో కనిపించే మైనపు లాంటి పదార్ధం. ఇది మన శరీరంలో కణాలు, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఆయిల్, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాల్లో అడ్డంకులు పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితిలో హైబీపీ, గుండెపోటు లాంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలతో కూడిన పండ్లు సిరల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

ఈ 6 పండ్లు అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి..

1. దానిమ్మ: అనేక పండ్ల రసాల మాదిరిగానే, దానిమ్మ రసంలో కూడా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇతర రసాల కంటే దానిమ్మ రసంలో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు గుండెకు రక్షణను అందిస్తాయి. అలాగే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మీరు దీన్ని ఫ్రూట్ సలాడ్‌లో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

2. అరటిపండు: అరటిపండులో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది. అయితే ఇది పెరిగిన కొలెస్ట్రాల్‌ను గ్రహించే కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటి ముఖ్యంగా కరిగే ఫైబర్‌కు మంచి మూలం అని చెబుతుంటారు. ఇది ఆరోగ్యకరమైన శరీరాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

3. పుచ్చకాయ: పుచ్చకాయలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయలో విటమిన్ సి, పొటాషియం ఉండటం వల్ల కొవ్వు సులువుగా కరిగిపోతుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ యాంటీఆక్సిడెంట్, శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

4. యాపిల్: కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో యాపిల్ అత్యంత ప్రభావవంతమైనది. యాపిల్స్‌లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఆపిల్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

5. ద్రాక్ష: ద్రాక్ష తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్తప్రవాహంలోకి చేరి, చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కాలేయానికి తీసుకువెళుతుంది. అక్కడ నుంచి అది మరింత ప్రాసెస్ చేసేందుకు సహాయపడుతుంది.

6. కొబ్బరి నీరు: వేసవిలో అనేక వ్యాధులకు కొబ్బరి నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది ఒక అద్భుతమైన హైడ్రేటర్. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. నరాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది.

Tags:    

Similar News