జలుబుని నివారించాలంటే ఇమ్యూనిటీ పెంచాలి.. ఈ 2 విటమిన్లు తప్పనిసరి..!
జలుబుని నివారించాలంటే ఇమ్యూనిటీ పెంచాలి.. ఈ 2 విటమిన్లు తప్పనిసరి..!
Health Tips: శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల వాతావరణం మార్పు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటే ఆరోగ్య సమస్యలను సులువుగా ఎదుర్కోవచ్చు. ఇందుకోసం 2 రకాల విటమిన్ ఆధారిత ఆహారాలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.
విటమిన్ సి
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు దరిచేరకుండా ఉంటుంది. దీని కోసం కొన్ని రకాల ఆహారాలు తినాలి. ఆరెంజ్,జామ, బొప్పాయి , పైనాపిల్, కివి, టొమాటో, బ్రోకలీ, బంగాళాదుంప, ఉసిరికాయ, నిమ్మకాయ వంటి పండ్లని ఎక్కువగా తీసుకోవాలి.
విటమిన్ డి
శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. మారుతున్న సీజన్‌లో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. విటమిన్ డి పొందడానికి సులభమైన మార్గం ప్రతిరోజూ సూర్యుని వెలుతురులో కొంత సమయం గడపడం. అందుకే దీనిని 'సన్‌షైన్ విటమిన్' అని పిలుస్తారు. అయితే ఈ విటమిన్ కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా పొందవచ్చు.
విటమిన్ డి ఉన్న ఆహారాలు
ఆవు పాలు, గుడ్డు, చేప, నారింజ రసం, పుట్టగొడుగు, కాడ్ లివర్ ఆయిల్, ధాన్యపు మొదలైనవి తినవచ్చు.