Health Tips: బరువు తగ్గాలంటే ఉదయం టిఫిన్‌గా ఇవి తినాలి.. అవేంటంటే..?
Health Tips: ఈ రోజుల్లో బరువు పెంచుకోవడం చాలా సులభం కానీ తగ్గడమే చాలా కష్టం. పెరిగిన బరువు తగ్గించుకోవాలంటే నానా తంటాలు పడాలి.
Health Tips: ఈ రోజుల్లో బరువు పెంచుకోవడం చాలా సులభం కానీ తగ్గడమే చాలా కష్టం. పెరిగిన బరువు తగ్గించుకోవాలంటే నానా తంటాలు పడాలి. ఉదయం పూట రన్నింగ్, జిమ్‌లో వర్కవుట్స్, యోగా వంటివి చేయాలి. కానీ ఇవేమి చేయకుండా జీవనశైలిలో మార్పులు చేసి సులువుగా బరువు తగ్గించుకోవచ్చు. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ముందుగా ఆకలి అదుపులో ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. అయితే టిఫిన్‌గా ఎలాంటి ఆహారాలు తినాలో ఈరోజు తెలుసుకుందాం.
ఓట్ మీల్
ఉదయాన్నే టిఫిన్‌గా ఓట్ మీల్ తినడం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇందులో ప్రొటీన్ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాదు ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇది తిన్నాక పదే పదే ఆకలి వేయదు. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోరు. ఇది బరువు తగ్గడానికి దారి తీస్తుంది.
పోహ
పోహా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది తక్కువ కేలరీల ఆహారం. బరువు తగ్గించుకోవాలంటే అల్పాహారంలో పోహా తినడం అలవాటు చేసుకోవాలి. అయితే ఇది తయారుచేసేటప్పుడు కూరగాయలను ఎక్కువగా ఉపయోగించాలి. ఇది తినడం వల్ల త్వరగా ఆకలివేయదు. దీంతో బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
ఉప్మా
రవ్వ, కూరగాయలతో చేసే ఉప్మా సులభంగా జీర్ణమవుతుంది. ఇది తేలికపాటి ప్రోటీన్ ఆహారం. దీనిని చాలా తొందరగా తయారుచేయవచ్చు. బరువు తగ్గాలని ఆలోచించేవారు తప్పకుండా ఉప్మాని టిఫిన్‌గా తీసుకోవాలి. దీనిని తినడం వల్ల మళ్లీ మళ్లీ తినాలనే కోరిక ఉండదు.
ఇడ్లీ
ప్రతిరోజు ఉదయం పూట ఇడ్లీని టిఫిన్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలివేయదు. తరచుగా ఆహారం తీసుకోకుండా ఉంటారు. అంతేకాదు ఇది సులువగా జీర్ణమవుతుంది.