Health Tips: కొవ్వు తగ్గాలంటే ఈ పండు తినాల్సిందే.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికి తెలిసిందే.

Update: 2023-01-30 15:15 GMT

Health Tips: కొవ్వు తగ్గాలంటే ఈ పండు తినాల్సిందే.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికి తెలిసిందే. దీని కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్‌తో సహా అనేక ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రత్యేక పండు మీకు సహాయం చేస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి అవకాడో తినవచ్చు. ఇది ఖరీదైన పండు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పండు తినేవారి సంఖ్య పెరిగింది. ఇది గుండె ఆరోగ్యాన్ని, కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరం మొత్తం అభివృద్ధికి సహాయపడుతుంది.

అవోకాడోలో లభించే పోషకాలు

మీడియం సైజు అవోకాడోలో దాదాపు 240 కేలరీలు, 13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ప్రోటీన్, 22 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల ఫైబర్, 11 మిల్లీగ్రాముల సోడియం ఉంటాయి. దాదాపు 6 నెలల పాటు ఆవకాడో తినే వ్యక్తులపై కొన్ని పరిశోధనలు జరిగాయి. ఇలా చేయడం వల్ల నడుము, పొత్తికడుపులోని కొవ్వు తగ్గడంతో పాటు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తగ్గినట్లు తేలింది. మంచి ఆరోగ్యం కోసం మీరు కూడా ఈ ప్రత్యేకమైన పండును తినవచ్చు.

అవకాడోలు అత్యధికంగా ఫైబర్తో లోడ్ చేయబడి ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఊబకాయంతో సంబంధం ఉన్న అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవకాడోలో "కరిగే, కరగని" ఫైబర్లు రెండూ ఉంటాయి. క్రమంగా 25% కరిగే ఫైబర్ ఉండగా 75% కరగని ఫైబర్ ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతాయి.అవకాడోలను తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను 20% వరకు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను 22% వరకు తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను 11% వరకు పెంచవచ్చునని అనేక పరిశోధనలలో తేలింది.

Tags:    

Similar News