Curry Leaves: కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Curry Leaves: బరువు తగ్గడానికి ప్రజలు వివిధ పద్ధతులను అవలంభిస్తారు. ఆహారంలో పండ్లు, కూరగాయల రసాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
Curry Leaves: బరువు తగ్గడానికి ప్రజలు వివిధ పద్ధతులను అవలంభిస్తారు. ఆహారంలో పండ్లు, కూరగాయల రసాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది కాకుండా కొన్ని హోమ్ రెమిడిస్ కూడా బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీరు కరివేపాకులను ఆహారంలో, రసం తయారీలో ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్కరి ఇళ్లలో కరివేపాకులను సులభంగా కనుగొంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కరివేపాకు దివ్యౌషధం. కరివేపాకులను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వు తొలగిపోతుంది. బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. కరివేపాకు రసం తాగడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
1. జీర్ణక్రియలో మెరుగుదల
మన జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తే శరీరంపై కొవ్వు పేరుకుపోదు. దీంతో బరువు కూడా పెరగరు. కరివేపాకు తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా గ్యాస్, అజీర్ణం సమస్య ఉండదు. అంతే కాకుండా పేగులకు మేలు జరుగుతుంది. దీని వల్ల మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
2. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది
రోజూ కరివేపాకు ఆకులను తినడం ద్వారా శరీరం సహజంగా డిటాక్స్ అవుతుంది. కరివేపాకు శరీరాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ తొలగిపోతాయి. కరివేపాకు కేలరీలను వేగంగా కరిగిస్తుంది. అంతే కాకుండా శరీరంపై కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం కరివేపాకు రసం లేదా టీ తాగడం వల్ల మీ శక్తి స్థాయి, జీవక్రియ రెండింటినీ పెంచుతుంది.
3. కొవ్వును తగ్గించడంలో ఎఫెక్టివ్
బరువు తగ్గించడంలో కరివేపాకు అత్యంత ప్రభావవంతమైనది. కరివేపాకు బరువు తగ్గడానికి ఒక ఉత్ప్రేరకం వలె పనిచేస్తుంది. ఇందులో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఒబెసిటీ, లిపిడ్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. కరివేపాకు తినడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.