Holi 2023: ఈ చర్మ సమస్యలుంటే హోలీకి దూరంగా ఉండటం మేలు.. లేదంటే చాలా ప్రమాదం..!

Holi 2023: హోలీ అంటే రంగుల పండుగ. ప్రజలు ఒకరినొకరు రంగులు పూసుకుంటూ ఆనందంగా జరుపుకుంటారు.

Update: 2023-03-04 03:30 GMT

Holi 2023: ఈ చర్మ సమస్యలుంటే హోలీకి దూరంగా ఉండటం మేలు.. లేదంటే చాలా ప్రమాదం..!

Holi 2023: హోలీ అంటే రంగుల పండుగ. ప్రజలు ఒకరినొకరు రంగులు పూసుకుంటూ ఆనందంగా జరుపుకుంటారు. అయితే చర్మ సమస్యలతో ఇబ్బంది పడే వారు హోలీ రంగులకు దూరంగా ఉండాలి. లేదంటే ఈ రంగులు సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. కొన్నిరకాల చర్మ సమస్యలు ఉన్నవారు హోలికి దూరంగా ఉండాలి. వారి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. ఫంగల్ ఇన్ఫెక్షన్

ఒక వ్యక్తి చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య ఉంటే దురద, ఎర్రటి దద్దుర్లు, బర్నింగ్ సమస్యలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు హోలీ ఆడకుండా ఉంటే ఉత్తమం. లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

2. రింగ్‌వార్మ్‌

ఒక వ్యక్తికి రింగ్‌వార్మ్‌ సమస్య ఉన్నప్పుడు ఆ వ్యక్తి హోలీ ఆడటం మానుకోవాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుంది. హోలీ ఆడటం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.

3. తామర

ఒక వ్యక్తికి ఎగ్జిమా సమస్య ఉన్నప్పుడు తీవ్రమైన దురద, ఎరుపు, వాపు, చర్మంలో పగుళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితిలో సదరు వ్యక్తి హోలీ రంగులకు దూరంగా ఉండాలి. లేదంటే సమస్య మరింత పెరుగుతుంది.

4. సోరియాసిస్

సోరియాసిస్ సమస్య ఉన్నా హోలీ రంగులకు దూరంగా ఉండాలి. సోరియాసిస్ సమస్య సమయంలో ఒక వ్యక్తి దురద, పొలుసుల చర్మం మొదలైన సమస్యలని ఎదుర్కోవలసి ఉంటుంది. హోలీ రంగులు ఈ సమస్యను మరింత పెంచుతాయి. అందుకే ఇలాంటి వ్యక్తులు హోలికి దూరంగా ఉండాలి.

Tags:    

Similar News