Health Tips: మాంసాహారం కంటే ఈ ఆహారాలు చాలా బెస్ట్‌.. బరువు అస్సలు పెరగరు..!

Health Tips: మాంసాహారం కంటే ఈ ఆహారాలు చాలా బెస్ట్‌.. బరువు అస్సలు పెరగరు..!

Update: 2022-07-30 04:54 GMT

Health Tips:మాంసాహారం కంటే ఈ ఆహారాలు చాలా బెస్ట్‌.. బరువు అస్సలు పెరగరు..!

Health Tips: నేటి కాలంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. జిమ్‌కి వెళ్లడానికి, పరుగెత్తడానికి, నడవడానికి ఎవరికీ సమయం ఉండటం లేదు. నిరంతరాయంగా పనిచేసిన తరువాత ఒక వ్యక్తి అవసరానికి మించి ఆహారం తీసుకుంటున్నాడు. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. రోజంతా మొబైల్‌లో సమయం గడపడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, తమలో తాము మాట్లాడుకోవడం, ఇవన్నీ బరువు పెరగడానికి కారణమవుతున్నాయి.

కూరగాయలు

కూరగాయలు తినడం ఎప్పుడైనా ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలంటే ముందుగా ఆహారంలో పచ్చి కూరగాయలను చేర్చుకోవాలి. పొట్లకాయ, పాలకూర, మెంతికూర, పుట్టగొడుగులు, బ్రకోలీ, బెండకాయ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు బరువును వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి. మీరు ఆకుపచ్చ కూరగాయలను కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు. వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బరువు కూడా వేగంగా తగ్గిస్తాయి.

పండ్ల రసాలు

పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. త్వరగా కడుపు నింపుకోవడానికి సులభమైన మార్గం. మీకు తినడానికి సమయం లేనప్పుడు పండ్ల రసాలు తీసుకుంటే చాలా మంచిది. ఇవి ఒక ద్రవ ఆహారంగా చెప్పవచ్చు. రోజూ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

డ్రై ఫ్రూట్స్

భారతదేశంలోని కాశ్మీర్‌లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మీరు దీన్ని 12 నెలలు తినవచ్చు. వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జీడిపప్పు, ఖర్జూరం, పిస్తా, బాదం, వంటి డ్రై ఫ్రూట్స్‌ను రోజూ తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు మన ఆహారాన్ని సమతుల్యం చేసి ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి.

Tags:    

Similar News