Health: పరగడుపున ఈ పానీయాలు తాగితే పొట్ట మొత్తం క్లీన్..!

Health: ఆధునిక జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో అనేక రకాల టాక్సిన్స్‌ పేరుకుపోతున్నాయి.

Update: 2022-07-07 01:30 GMT

Health: పరగడుపున ఈ పానీయాలు తాగితే పొట్ట మొత్తం క్లీన్..!

Health: ఆధునిక జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో అనేక రకాల టాక్సిన్స్‌ పేరుకుపోతున్నాయి. దీని వల్ల చాలామంది అనేక రకాల వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారు. వీటిలో ఊబకాయం, కడుపు సమస్యలు, అధిక బీపీ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిలో వ్యాధులని నివారించడానికి టాక్సిన్స్‌ని శరీరం నుంచి బయటికి పంపించాలి. ఇందుకోసం కొన్ని ప్రత్యేకరకమైన డ్రింక్స్ ఉన్నాయి. వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ట్యాక్సిన్స్‌ని తొలగించుకోవచ్చు. అది ఏ విధంగా అనేది తెలుసుకుందాం.

దాల్చిన చెక్క, తేనె

దాల్చిన చెక్క, తేనె శరీరంలో మురికిని తొలగించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ పానీయం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని మురికిని క్లీన్ చేయడంలో సహాయపడతాయి. అదే విధంగా తేనెలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రెండింటి మిశ్రమం మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పుదీనా, దోసకాయ

పుదీనా, దోసకాయ పానీయం శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. నిజానికి దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఈ పరిస్థితిలో ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంచుతుంది. మరోవైపు పుదీనా ఆకులలో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కనిపిస్తాయి. మొత్తంమీద ఈ పానీయం మీకు చాలా ఆరోగ్యకరమైనదని చెప్పవచ్చు.

Tags:    

Similar News