Turmeric Reducing Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో పసుపు సూపర్.. ఈ విధానంలో వాడితే మంచి ఫలితాలు..!
Turmeric Reducing Belly Fat:నేటి రోజుల్లో చాలామంది బెల్లీఫ్యాట్‌తో బాధపడుతున్నారు.
Turmeric Reducing Belly Fat: నేటి రోజుల్లో చాలామంది బెల్లీఫ్యాట్‌తో బాధపడుతున్నారు. శారీరక శ్రమ తగ్గడం, కూర్చొని పనిచేసే ఉద్యోగాలు పెరగడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. దీనివల్ల తరచుగా అనారోగ్యానికి గురై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు మార్కెట్‌లో కొత్తగా వచ్చే అన్ని వెయిట్ లాస్ ప్రొడాక్ట్స్ కొని వాడుతున్నారు. దీనివల్ల వెయిట్, ఫ్యాట్ తగ్గడం ఏంటో కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తున్నాయి. అందుకే సహజసిద్దంగా మన వంటగదిలో లభించే పసుపును వాడి బెల్లిఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.
పసుపులో కనిపించే ప్రధాన మూలకం కర్కుమిన్. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండు లక్షణాలు బరువు తగ్గడంలో సాయపడుతాయి. అధిక బరువు ఊబకాయంతో బాధపడేవారికి తరచుగా శరీరంలో వాపు సమస్య ఉంటుంది. పసుపులో ఉండే కర్కుమిన్ ఈ మంటను తగ్గించడంలో సాయపడుతుంది. బరువు తగ్గే ప్రక్రియను సులభతరం చేస్తుంది.
మెటబాలిజం పెరగడం
శరీరంలోని జీవక్రియలు ఎంత వేగంగా జరిగితే అంత ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరం జీవక్రియను పెంచడంలో సాయపడుతుంది. దీని కారణంగా శరీరం త్వరగా కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది.
బరువు తగ్గడానికి పసుపును ఎలా తీసుకోవాలి?
పసుపు నీరు : ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా పసుపు పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి ఉదయం పరగడుపున తాగాలి.బరువు తగ్గడానికి ఇది సులభమైన అత్యంత ప్రభావవంతమైన చిట్కా.
పసుపు పాలు : ఒక గ్లాసు వేడి పాలలో అర చెంచా పసుపు పొడి కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి తాగాలి. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా మంచి నిద్ర కూడా వస్తుంది.
ఆహారంలో చేర్చండి : మీ కూరగాయలు, పప్పులలో పసుపును క్రమం తప్పకుండా చేర్చండి. దీనివల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా బరువు తగ్గడానికి సాయపడుతుంది.