Moving Legs: తరచుగా కాళ్లు కదుపుతున్నారా.. అయితే ఇది ఆ వ్యాధే..?

Moving Legs: తరచుగా కాళ్లు కదుపుతున్నారా.. అయితే ఇది ఆ వ్యాధే..?

Update: 2022-06-15 15:30 GMT

Moving Legs: తరచుగా కాళ్లు కదుపుతున్నారా.. అయితే ఇది ఆ వ్యాధే..?

Moving Legs: కొన్నిసార్లు పని చేస్తున్నప్పుడు మన మనస్సును పనిలో కేంద్రీకరించడానికి మనకి తెలియకుండానే కొన్ని కార్యకలాపాలని చేస్తాం. తద్వారా మన దృష్టి ఆ పనిలో కేంద్రీకృతమై ఉంటుంది. అదే సమయంలో కొంతమంది తమ మనస్సును సెట్ చేయడానికి పాదాలను కదిలిస్తూ ఉంటారు. కూర్చున్నప్పుడు కాళ్ళు కదపడం లేదా నిద్రపోతున్నప్పుడు ఇలా చేయడం అనేది ఒక వ్యాధి అని చెప్పవచ్చు. కుర్చీపై కూర్చున్నప్పుడు కాళ్లు వణుకడం లాంటి సమస్యలకి కారణం ఏంటో తెలుసుకుందాం.

తరచుగా కాళ్ల కదిపే అలవాటుని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వ్యాధిగా చెబుతారు. ఇది 10 శాతం మందికి సంభవిస్తుంది. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్య. ఈ సమస్య స్త్రీలలో, పురుషులలో సంభవిస్తుంది. ఇది ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా నొప్పి మొదలవుతుంది. మనం కాళ్ళను కదిలించినప్పుడు ఈ నొప్పి తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ బాధాకరమైన పరిస్థితి పదేపదే వచ్చినప్పుడు దానిని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటారు. ఐరన్ లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

ఈ సిండ్రోమ్‌కి ఖచ్చితమైన కారణాన్ని చెప్పడం కష్టం అయినప్పటికీ కొన్నిసార్లు ఇది జన్యుపరంగా కూడా వస్తుంది. చాలా సార్లు ఇంట్లో తల్లి లేదా తండ్రి ఈ సమస్యను కలిగి ఉంటారు. ఇది పిల్లలలో సంభవించే అవకాశం ఉంటుంది. ఈ సిండ్రోమ్‌ను నయం చేయడానికి ఫిజియోథెరపీ చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడితే సరిపోతుంది. 

Tags:    

Similar News