Bad Cholesterol: చెడు కొలస్ట్రాల్‌కి ఈ చెడ్డ అలవాట్లే కారణం.. వదిలేయకపోతే వీటికి గురికావాల్సిందే..!
Bad Cholesterol: కొలస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే ఒక జిగట పదార్థం.
Bad Cholesterol: నేటి ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది అనారోగ్యం భారినపడుతున్నారు. ముఖ్యంగా అధిక కొలస్ట్రాల్ వల్ల గుండెపోటు, ఇతర వ్యాధులకి గురవుతున్నారు. కొలస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే ఒక జిగట పదార్థం. ఇది ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ చెడు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరిగింది. శరీరంలో కొవ్వు పెరగడానికి చెడు అలవాట్లే కారణం. వీటిని త్వరగా వదిలేస్తే ఆరోగ్యానికి మంచిది.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
రోజువారీ ఆహారంలో అధిక సంతృప్త లేదా ట్రాన్స్ కొవ్వును తీసుకుంటున్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ఈ రకమైన కొవ్వు ఎర్రమాంసం, పాల ఉత్పత్తులు, ప్యాక్ చేసిన ఆహారాలు, తీపి పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాలకి దూరంగా ఉండాలి.
ఊబకాయం
బరువును క్రమం తప్పకుండా చెక్ చేయకుంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. నడుము చుట్టూ కొవ్వు వేగంగా పెరుగుతుంటే అప్రమత్తంగా ఉండాలి. ఎత్తుకు అనుగుణంగా బరువు మెయింటెన్ చేయాలి. ఊబకాయం అనేక వ్యాధులకు మూలమని గుర్తుంచుకోండి.
వ్యాయామం చేయకపోవడం
ప్రస్తుత కాలంలోని బిజీ లైఫ్‌స్టైల్ వల్ల చాలామంది వ్యాయామం స్కిప్ చేస్తున్నారు. అయితే కొలెస్ట్రాల్ పెరగకూడదనుకుంటే రోజుకు కనీసం ఒక గంట వ్యాయామం చేయడం అవసరం. ఇది మొత్తం ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో సహాయపడుతుంది
ధూమపానం
యువకులు సిగరెట్ తాగడాన్ని స్టైల్‌గా ఫీలవుతారు. కానీ తరువాత ఇది మానుకోలేని అలవాటుగా మారుతుంది. ఈ వ్యసనం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది.
మద్యపానం
ఆల్కహాల్ వ్యసనం ఏ వ్యక్తినైనా నాశనం చేస్తుంది. ఇది కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. ఈ చెడు అలవాటును ఎంత త్వరగా వదిలేస్తే ఆరోగ్యానికి అంత మంచి చేసినవారవుతారు.