Health Tips: అధిక కొలస్ట్రాల్‌ లక్షణాలని సకాలంలో గుర్తించండి.. లేదంటే చాలా ప్రమాదం..!

Health Tips: కొలెస్ట్రాల్ పేరు వినగానే అది చాలా చెడ్డదని అనుకుంటారు.

Update: 2023-02-07 12:30 GMT

Health Tips: అధిక కొలస్ట్రాల్‌ లక్షణాలని సకాలంలో గుర్తించండి.. లేదంటే చాలా ప్రమాదం..!

Health Tips: కొలెస్ట్రాల్ పేరు వినగానే అది చాలా చెడ్డదని అనుకుంటారు. కానీ ఇందులో రెండు రకాల కొలస్ట్రాల్‌ ఉంటాయి. మంచి కొలస్ట్రాల్‌ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ అంటే LDL పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. కొన్నిసార్లు అధిక కొలెస్ట్రాల్ రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించాలి. శరీరంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. అధిక రక్తపోటు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అది నేరుగా రక్తపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొవ్వు శాతం ఎంత పెరిగితే రక్తపోటు అంతగా పెరుగుతుంది. ఈ కారణంగా రక్తాన్ని గుండెకు పంప్ చేయడానికి ధమనులు చాలా కష్టపడాల్సి వస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి.

2. కాళ్లు, చేతులు తిమ్మిర్లు

పాదాలు మొద్దుబారడం, కాళ్లు చేతులు తిమ్మిరికి గురికావడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతమని గుర్తించండి. ధమనులలో రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలో అవరోధం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. పాదాలలో నొప్పి, తిమ్మిరి కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగదు.

3. గోర్ల రంగులో మార్పు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సిరల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చేతివేళ్లు, కాలి వేళ్లకు సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి లేత గులాబీ రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతాయి. అధిక కొలెస్ట్రాల్‌ వల్ల ఇలా జరుగుతుందని గుర్తించండి.

Tags:    

Similar News