High BP: హైబీపీ రోగులకి ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ.. అవేంటంటే..?

High BP: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బీపీ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

Update: 2022-07-27 14:30 GMT

High BP: హైబీపీ రోగులకి ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ.. అవేంటంటే..?

High BP: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బీపీ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనే వ్యక్తుల రక్తనాళాలలో ఒత్తిడి ఉంటుంది. ఇది సమయానికి నియంత్రించాలి. లేదంటే అది అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని సృష్టిస్తుంది. బీపీ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

వాస్తవానికి అధిక రక్తపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది జీవనశైలి సరిగ్గా లేకపోవడం. భారతదేశంలో ఆయిల్ ఫుడ్ తీసుకునే ట్రెండ్ చాలా ఎక్కువ. వీటిలో ఉండే సంతృప్త కొవ్వు కారణంగా రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీని కారణంగా గుండెకు రక్తం చేరుకోవడం చాలా కష్టమవుతుంది. రక్తపోటు పెరుగుతుంది. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, టీ-కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య రోజు రోజుకి పెరుగుతోంది.

గుండెపోటు

అధిక రక్తపోటు గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, నరాల వ్యాధితో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధమనులలో రక్త ప్రసరణ వేగం తక్కువవుతుంది. అందులో ఎక్కవ స్థలాన్ని కొవ్వు ఆక్రమిస్తుంది. దీంతో రక్త ప్రసరణలో సమస్య ఏర్పడుతుంది. ఇది చాలాకాలం కొనసాగితే గుండెపోటు వస్తుంది.

కిడ్నీ వ్యాధి

అధిక బీపీ వల్ల కిడ్నీ వ్యాధి వస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అధిక బీపీ వల్ల కిడ్నీకి సంబంధించిన రక్త నాళాలు ఇరుకుగా మారుతాయి. దీని కారణంగా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయలేవు. ఇందులో కొవ్వు పేరుకుపోతుంది.

కళ్లపై చెడు ప్రభావం

అధిక రక్తపోటు కంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారిలో కంటిచూపు తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకే బీపీ పేషెంట్లు ఆరోగ్యం పై కచ్చితంగా దృష్టి సారించాలి.

Tags:    

Similar News