Kitchen Hacks: మీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే చెడు వాసన వస్తోందా? బ్యాడ్ స్మెల్‌ను వదిలించుకోండిలా
Kitchen Hacks: కొన్ని ఫుడ్స్, ఫ్రిజ్ లో , ఫ్రీజర్ లో స్టోర్ చేస్తే అవి త్వరగా పాడువుతుంటాయి. దీంతో రిఫ్రిజిరేటర్ దుర్వాసన వెదజల్లుతుంది. అందుకే ఫ్రిజ్మెయింటెనెన్స్ గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
Kitchen Hacks:నేటికాలంలో అందరి ఇళ్లలోనూ రిఫ్రిజిరేటర్లు ఉంటున్నాయి. వారి స్తోమతకు తగ్గట్లుగా చిన్నది, లేదా పెద్దది కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటి వినియోగం గురించి చాలా మందికి స్పష్టమైన అవగాహన అనేది ఉండదు.ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ ఫ్రిజ్ లో, ఫ్రీజర్ లో స్టోర్ చేసినట్లయితే అవి తర్వగా పాడవుతుంటాయి. దీంతో ఫ్రిజ్ అంతా కూడా దుర్వాసన వస్తుంది. అందుకే ఫ్రిజ్ మెయింటెనెన్స్ గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.
ఏవైనా సూప్ లు గిన్నెల్లో నుంచి లీక్ అవుతుంటాయి. చెడిపోయిన ఆహారం ఎక్కువ కాలం స్టోర్ చేస్తే బూజు పడుతాయి. రెగ్యులర్ గా శుభ్రం చేయకపోవడం వల్ల ఫ్రిజ్ మురికి గా మారుతుంది. బ్యాక్టీరియా పెరిగిపోవడంతోపాటు దుర్వాసన వస్తుంది. స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండే ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఫ్రీజర్ లో దుర్వాసనకు కారణంగా చెప్పుకోవచ్చు. కంప్రెసనర్ సరిగ్గా పనిచేయకపోవడం, ఫ్రీజర్ లేదా ఫ్రిజ్ డోర్ సెట్ అవ్వకపోవడం, డీ ఫ్రాస్ట్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మంచు పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. అయితే ఇలా వ్యాపించే బ్యాడ్ స్మెల్ ను కొన్ని టిప్స్ తో దూరం చేసుకోవచ్చు.అవేంటో చూద్దామా....
ఫ్రిజ్, ఫ్రీజర్ ను ఖాళీ చేయాలి
ఫ్రిజ్ దుర్వాసన వస్తుంటే..దాన్ని పూర్తిగా క్లీన్ చేయడం చాలా ముఖ్యం. ఫ్రిజ్ కు పవర్ సప్లై ఆపేయాలి. దాంట్లో ఉన్న అన్ని పదార్థాలు బయట పెట్టాలి. షెల్ఫ్ లు, డ్రాయర్ లపైనా ఏవైనా ఆహార పదార్థాలు పేరుకుపోతే వాటిని క్లీన్ చేయాలి. తడి గుడ్డతో రిఫ్రిజిరేటర్ లోని అన్ని భాగాలను పూర్తిగా క్లీన్ చేయాలి.
వీటితో క్లినింగ్ చేయడం బెటర్
రిఫ్రిజిరేటర్, ఫ్రీజర్ శుభ్రం చేసేందుకు కెమికల్స్ కాకుండా యాపిల్ సైడర్ వెనిగర్, బొగ్గు లేదా కాఫీ గ్రౌండ్ వంటి ఫడ్స్ ఉపయోగించడం మంచిది. గోరువెచ్చని నీటిలో వీటిని కలపాలి. స్మూత్ గా ఉండే టవల్ ను దీంట్లో ముంచి, ఫ్రిజ్ లోపలి భాగాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. ఇలాంటి నేచురల్ ఫుడ్స్ ఫ్రిజ్ దుర్వాసనను పోగొట్టి , మంచి వాసనను వ్యాపింపజేస్తాయి. ఈ ఫ్లేవర్స్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
బేకింగ్ సోడా
రిఫ్రిజిరేటర్ ను క్లీన్ చేశాక..దాన్ని వెంటనే ఆన్ చేకూడదు. కాసేపు డోర్ తెరచి పెట్టాలి. బేకింగ్ సోడాను ఒక డబ్బాలో వేసి..దాని మూత తీసి ఫ్రిజ్ లో పెట్టాలి. దీంతో రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ వాసన ఏమైనా ఉంటే పోతుంది.
టెంపరేచర్
ఫ్రిజ్ మెయింటెనెన్స్ గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. కనీసం వారానికి ఒకసారి అయినా ఫ్రిజ్ ను క్లీన్ చేయాలి. ఎక్కువ కాలం స్టోర్ చేసిన వాటిని బయట పడేయాలి. ఫ్రిజ్ టెంపరేచర్ ను సీజన్ కు తగ్గట్లుగా సెట్ చేసుకోవాలి. ఫ్రీజర్ దగ్గర ఉండే బటన్ పై దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి. డీప్ ఫ్రిజ్ లో మంచు పేరుకుపోతే డీఫ్రాస్టింగ్ చేయాలి.
2019లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం..ఫ్రిడ్జ్ లలో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో దుర్వాసనను తగ్గించడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. ఈ పరిశోధనలో టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఫుడ్ సేఫ్టీ నిపుణులు, మైక్రోబయాలజిస్టు డాక్టర్ జాన్ సన్ పాల్గొన్నారు.
వేడినీళ్లు, నిమ్మరసం:
కొన్ని వేడి నీళ్లు తీసుకుని అందులో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో పోసి, ఫ్రిడ్జ్ లోపల స్ప్రే చేయాలి. తర్వాత ఒక పొడి వస్త్రంతో మొత్తం తుడవాలి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. తర్వాత అందులో వస్తువులు సర్థుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు ఫ్రిడ్జ్ ను శుభ్రం చేసుకుంటే దుర్వాసన పోతుందని నిపుణులు చెబుతున్నారు.