Summer Tips: వేసవిలో వీటికి దూరంగా ఉండండి
Summer Tips:గత ఏడాది ఎండాకాలం కరోనా కారణంగా ప్రజలందరూ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.
Summer Tips: గత ఏడాది ఎండాకాలం కరోనా కారణంగా ప్రజలందరూ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో సూర్యుడి ప్రతాపం నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితులు చక్కబడటంతో అందరూ వారి వారి నిత్యకార్యక్రమాల్లో భాగంగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది వేసవి అధిక ఉష్ణతాపాన్ని వెదజల్లనుంది. భానుడి భగభగలతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సాధారణంగా ఎండలు తీవ్రత ఏప్రిల్ నుంచి ఉంటాయి. అయితే ఈసారి మార్చి ఆరంభం నుంచే వేసవి సెగలు మొదలవుతాయని, మార్చి చివరి నాటికి 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎండల నుంచి రక్షణ పొందాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలిన అవసరం ఉందని నిలపుణు హెచ్చరిస్తున్నారు. రాను రాను ఎండలు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. భానుడి ధాటికి తట్టుకోవాలంటే నీరు తీసుకోవాలని, దాని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నయని చెబుతున్నారు. నీరు అధికంగా తీసుకుంటే డిహైడ్రేట్ కాకుండా రక్షిస్తుంది. తరచూ చల్లటి పదార్థాలు తీసుకోవడం లేదంటే ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలకు తీసుకోకుడదని వారు చూచిస్తున్నారు.
ముఖ్యవిషయాలు
మంచినీరు:
రోజుకు 8 నుండి 10 గ్లాసుల మంచి నీళ్లు తాగాలి.. లిక్విడ్స్ తాగడం కష్టంగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడంలో.. బాడీ ఫంక్షన్ ని సరిగ్గా సక్రమంగా జరగడానికి ఈ ఫ్లూయిడ్స్ చాలా ముఖ్యం.
జీలకర్ర
జీలకర్ర శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. జీలకర్ర వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. జీలకర్ర శరీరంలో వేడి తగ్గించి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. దురదలు, ఎలర్జీని దరిచేరనియదు. అనేక మంది సమ్మర్ లో మొటిమలు, వేడి గడ్డలో ఇబ్బందులు పడతారు. అయితే జీలకర్ర అలాంటి వాటిని నిరోధిస్తుంది. జీలకర్రని, రాళ్ళ ఉప్పులో టిలో సరిపడా నీళ్లలో కలిపి ఒకరోజంతా ఉంచాలి, ఆ తర్వాత దానిని మొత్తం వడగట్టండి నీళ్ళను తాగాలి. ఇలా చేస్తే శరీరం ఢిహైడ్రేషన్ నుంచి రక్షించబడుతుంది. మజ్జిగ లో లేదా పెరుగులో కలిపి జిలకర్ర పొడి తీసుకుంటే చాలా మంచింది.
లెమన్ గ్రాస్
లెమన్ గ్రాస్(LemonGrass) అజీర్తి సమస్యలని కూడా తొలగిస్తుంది. బాడీ కూల్ చేస్తుంది. నిమ్మరసంతో ఉప్పు కలిసి తీసుకుంటే బాడీని హైడ్రేట్ లో ఉంచుతుంది. వీటి వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం లేదు. కుండ లో నీళ్లు దాని యొక్క టెంపరేచర్ తగ్గిస్తుంది. షర్బత్, బట్టర్ మిల్క్, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వీటీకి దూరంగా ఉండాలి
ఎండాకాలంలో ఆల్కహాల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శరీరానికి వేడికలిగించే పదార్థాలు ఏవీ తీసుకోవకుడదని వారు సూచిస్తున్నారు. కూలింగ్ వాటర్ తాగడం మంచిది కాదు. ఫ్రీజ్ వాటర్ కంటే మట్టికుండలో నీరు తాగడం ఎంతో శ్రేయస్కరం అని చెబుతున్నారు.