Sugar vs Salt: ఉప్పు, చక్కెర ఎంత పరిమాణంలో తీసుకోవాలి.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదం..?
Sugar vs Salt: నేటి జీవనశైలిలో తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది అనేక ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు.
Sugar vs Salt: నేటి జీవనశైలిలో తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది అనేక ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇందులో ప్రధానమైంది అధిక బరువు సమస్య. దీనిని సకాలంలో నియంత్రించకపోతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీని కోసం ముందుగా డైట్‌లో మార్పు చేయాలి. అలాగే రోజువారీ చక్కెర, ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పంచదార, ఉప్పు ఆరోగ్యానికి మేలు, హాని రెండూ చేస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఒక వ్యక్తి ప్రతిరోజూ 6 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. సోడియం శరీరానికి చాలా ముఖ్యమైనది కానీ శరీరంలో సోడియం పరిమాణం పెరగడం వల్ల, ఉబ్బసం, ఛాతీలో మంట, ఎముకల వ్యాధి, అధిక రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి. అలాగే శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన జ్యూస్‌లు, కుకీలు, క్యాండీలు, కేక్‌లు వంటి జంక్ ఫుడ్‌లో ఉండే రిఫైన్డ్ షుగర్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎక్కువ చక్కెరను తినే వారు గుండె జబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అయితే శరీరానికి పంచదార కూడా అవసరమే. కానీ ఎక్కువగా తింటే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి చక్కెరను అతిగా తినవద్దు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను తినడం మానుకుంటే ఉత్తమం. అలాగే ఉప్పు అధికంగా తినడం మానుకోండి. ఇది గుండెకే కాదు మొత్తం శరీరానికి ప్రమాదకరం. ఒక యువకుడు ప్రతిరోజూ 1500 mg సోడియం తినాలి. అదే సమయంలో ప్రతి వయోజన వ్యక్తి ప్రతిరోజూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలి. సోడియం మన కిడ్నీలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అధిక రక్తపోటుకు కారణం అవుతుంది.