Heart Attack: ఒక వ్యక్తి గుండెపోటును ఎన్నిసార్లు తట్టుకోగలడు? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Heart Attack: నేటికాలంలో గుండెపోటు వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. రెండేళ్ల బాబు గుండెపోటుతో మరణించిన ఘటన కూడా ఉంది. అయితే గుండెపోటుకు కారణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఒకవ్యక్తి గుండెపోటు ఎన్నిసార్లు వస్తే తట్టుకోగలడు. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం.

Update: 2024-08-04 09:38 GMT

Heart Attack:మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎన్నో జబ్బులకు కారణం అవుతున్నాయి. ఈ బిజీలైఫ్ లో చాలా మంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగా ప్రాణాలను కోల్పోవల్సి వస్తుంది. అందులో ఒకటి గుండెజబ్బు. ఈ మధ్యకాలంలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు అనేది చాలా తీవ్రమైన సమస్య. అయినప్పటికీ సరైన సమయంలో చికిత్స చేయించినట్లయితే రోజు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గుండెపోటు వచ్చిన వ్యక్తి ఎన్నిసార్లు దాన్ని తట్టుకోగలడు. ఈ ప్రశ్న చాలా మందిలో మెదులుతోంది. అయితే దీనికి సమాధానం అంతసులభం కాదు. ఎందుకంటే ఇది ఆ వ్యక్తి ఆరోగ్యం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

గుండెపోటు అంటే ఏమిటి?

గుండెపోటు అనేది గుండెకు రక్త సరఫరాలో ఆకస్మిక అంతరాయం కారణంగా ఏర్పడే అత్యవసర వైద్య పరిస్థితి. సరైన రక్త సరఫరా లేకపోతే..గుండె కండరాలు దెబ్బతింటాయి. దీని వల్ల ఆ వ్యక్తి మరణించే అవకాశం ఉంటుంది.

గుండెనొప్పి ఎందుకు వస్తుంది:

ప్రస్తుత రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే గుండెపోటును ఎదుర్కొంటున్నారు. అనారోగ్యకరమైన ఆహారం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు గుండె ధమనులలో అడ్డంకిని కలిగిస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మనం ఎక్కువ కొవ్వు పదార్ధాలను తీసుకుంటే, మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ గుండె ధమనులలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది, దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం గుండెకు చేరలేనప్పుడు గుండెపోటు వస్తుంది.

ఒక వ్యక్తికి ఎన్నిసార్లు గుండెపోటు రావచ్చు?

సాధారణంగా, ఒక వ్యక్తి తన జీవితంలో మూడు సార్లు గుండెపోటుకు గురవుతాడు. మొదటి, రెండవ గుండెపోటు తర్వాత, సరైన సమయంలో చికిత్స, జీవనశైలిని మెరుగుపరిచినట్లయితే ఒక వ్యక్తి జీవించగలడు. కానీ మూడవ గుండెపోటు తర్వాత, గుండె చాలా బలహీనంగా మారుతుంది. నాల్గవ గుండెపోటు నుండి బయటపడటం చాలా కష్టం అవుతుంది.

గుండెపోటు లక్షణాలు:

-తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి

-ఎడమ చేయి, మెడ లేదా దవడలో నొప్పి

-శ్వాస ఆడకపోవడం

-విపరీతమైన చెమట

-బలహీనత లేదా మైకము

గుండెపోటును ఎలా నివారించాలి?

-ధూమపానం, మద్యం సేవించడం పూర్తిగా మానుకోండి.

-పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పదార్ధాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినండి.

-రోజూ వ్యాయామం చేయండి.

-బరువును అదుపులో ఉంచుకోండి.

-రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించండి.

-మధుమేహాన్ని అదుపులో ఉంచుకోండి


Tags:    

Similar News