Eggs: రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది..! తెలుసుకోండి..

Eggs: రోజుకొక గుడ్డు తినాలని ప్రభుత్వమే చెబుతోంది. వైద్యులు కూడా ఇదే సిఫార్స్‌ చేస్తారు

Update: 2021-11-27 04:50 GMT

రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది..! తెలుసుకోండి.. (ఫైల్ ఇమేజ్)

Eggs: రోజుకొక గుడ్డు తినాలని ప్రభుత్వమే చెబుతోంది. వైద్యులు కూడా ఇదే సిఫార్స్‌ చేస్తారు. ఎందుకంటే గుడ్డు సంపూర్ణ ఆహారం. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. రోజుకు ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా పిల్లలు ప్రతిరోజు గుడ్డు తినాలి. అయితే ఎక్కువగా తింటే మాత్రం కొన్ని నష్టాలు ఉంటాయి. అసలు ఒక రోజు ఎన్ని గుడ్లు తినవచ్చు.. తదితర విషయాల గురించి చర్చిద్దాం.

గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే గుడ్డు మధ్య భాగంలో ఉండే పసుపు పచ్చ పదార్థంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఒక గుడ్డు పచ్చసొనలో దాదాపు 200 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. ప్రతిరోజూ 300 mg కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

అయితే ఒక వ్యక్తి రోజుకు ఎన్ని గుడ్లు తినాలి అనే దానిపై స్పష్టత లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి అధ్యయనంలో సగటు ఆరోగ్యం ఉన్న వ్యక్తి వారానికి 7 గుడ్లు తినవచ్చు అయితే మీరు ఏదైనా వ్యాధి, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు లేకుంటే రోజుకు 3 గుడ్లు తినవచ్చు. గుడ్లు పుష్టికరమైనవే కానీ గుడ్లు ఎన్ని కావాలంటే అన్ని తినాలని కాదు. వేసవిలో గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల ముఖ్యంగా పిల్లల్లో డయేరియా సమస్య కూడా రావచ్చు, కాబట్టి మనం గుడ్లు తినడం అదుపులో ఉంచుకోవాలి. కానీ గుడ్లలో ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, ఇతర యాంటీ ఆక్సైడ్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Tags:    

Similar News