బరువు తగ్గడానికి రోజు ఎన్ని కేలరీలు తీసుకోవాలి.. వయసు ప్రకారం తెలుసుకోండి..!

Age Wise Calories: రోజువారీ వినియోగించే కేలరీల సంఖ్య తగ్గించినట్లయితే సులువుగా బరువు తగ్గుతారు.

Update: 2022-09-29 12:00 GMT

బరువు తగ్గడానికి రోజు ఎన్ని కేలరీలు తీసుకోవాలి.. వయసు ప్రకారం తెలుసుకోండి..!

Age Wise Calories: రోజువారీ వినియోగించే కేలరీల సంఖ్య తగ్గించినట్లయితే సులువుగా బరువు తగ్గుతారు. అయితే ప్రతిరోజూ ఎన్ని కేలరీలు తీసుకోవాలో గుర్తించడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు కానీ అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వంటి అనేక వ్యాధులకు కారణమవుతుంది. అందుకే రోజూ తీసుకునే క్యాలరీలపై నిఘా ఉంచడం అవసరం.

సగటున రోజుకు ఎన్ని కేలరీలు..

మీరు రోజుకు ఎన్ని కేలరీలు తినాలి అనేది వయస్సు, లింగం, ఎత్తు, ప్రస్తుత బరువు, జీవక్రియ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణం కంటే తక్కువ కేలరీలు తీసుకోవడం ఉత్తమం. అయినప్పటికీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి తగినంత కేలరీలు తీసుకోవాలి. లేదంటే చాలా బలహీనమవుతారు.

సాధారణంగా చాలా మంది డైటీషియన్లు రోజుకి 1,000-1,200కి పరిమితం చేయాలని సూచిస్తారు. అయితే ఇది ఆరోగ్యకరమైన యువకులకు సరిపోదు. క్యాలరీలను ఎక్కువగా తగ్గించడం వల్ల అనేక తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీయడమే కాకుండా పోషకాహార లోపాల ప్రమాదానికి గురవుతారు. దీని కారణంగా జీవక్రియ రేటులో మార్పులు ఏర్పడుతాయి. అందుకే ఏది చేసిని వైద్యుల పర్యవేక్షణలో చేయడం ఉత్తమం.

మహిళలకు రోజువారీ కేలరీల చార్ట్

19-30 సంవత్సరాలు 2,000–2,400 కేలరీలు

31-59 సంవత్సరాలు 1,800–2,200 కేలరీలు

60+ సంవత్సరాలు 1,600–2,000 కేలరీలు

పురుషుల కోసం రోజువారీ కేలరీల చార్ట్

19-30 సంవత్సరాలు 2,400–3,000 కేలరీలు

31-59 సంవత్సరాలు 2,200–3,000 కేలరీలు

60+ సంవత్సరాలు 2,000–2,600 కేలరీలు

Tags:    

Similar News