Home Remedies: ఈ ఇంటి చిట్కాలతో ఫ్లూని తరిమికొట్టండి.. రోగనిరోధక శక్తికి ఈ ఆహారాలు ఎంతో కీలకం..!

Home Remedies: ఈ ఇంటి చిట్కాలతో ఫ్లూని తరిమికొట్టండి.. రోగనిరోధక శక్తికి ఈ ఆహారాలు ఎంతో కీలకం..!

Update: 2022-01-13 12:30 GMT

ఈ ఇంటి చిట్కాలతో ఫ్లూని తరిమికొట్టండి.. రోగనిరోధక శక్తికి ఈ ఆహారాలు ఎంతో కీలకం..!

Home Remedies: కరోనా ప్రస్తుతం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది. మన దేశం గురించి మాత్రమే చెప్పాలంటే, ఈ సమయంలో కోవిడ్ -19, డెల్టా, ఓమిక్రాన్ అనే మూడు రకాల వైరస్‌లు దాడి చేస్తున్నాయి. వీటిలో ఏదైనా వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత, మొత్తం శరీరాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో శరీరంలో ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, అలసట, నొప్పి, దగ్గు, జలుబు, తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలను చూపడం ప్రారంభిస్తుంది. అయితే, ఈ సమయంలో పరీక్ష చేయించుకుంటే నివేదికలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందో లేదో మీకు అర్థం కాకపోతే.. మీ రంలో ఇలాంటి లక్షణాలు కనిపించడం ప్రారంభించినట్లయితే, కొన్ని ప్రత్యేకమైన ఇంటి చిట్కాలనుసరించడం ద్వారా ఈ వైరస్‌లను పెరగకుండా నిరోధించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

విశ్రాంతి..

అలసట, శరీర నొప్పి, తలలో భారం, గందరగోళ స్థితి, చంచలత్వం మొదలైన సమస్యలలో మీరు చాలా శారీరక, మానసిక శ్రమను నివారించాలి. మీకు వీలైనంత ఎక్కువ విశ్రాంతితపోపాటు నిద్ర కావాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా, మీ శరీరం రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వైరస్‌ను తొలగించడంలో మెరుగ్గా పనిచేస్తుంది.

ద్రవాలు..

చలికాలం కావడంతో చాలా మంది నీరు తాగడం మానేస్తారు. ఇది మొత్తం శరీరానికి, ముఖ్యంగా కిడ్నీకి అస్సలు మంచిది కాదు. అందువల్ల, మీరు తగినంత నీరు తాగాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు వైరస్‌లను దూరం చేస్తుంది.

పసుపు పాలు..

టీ, కాఫీ తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే అవి మీ శరీరంలో డీహైడ్రేషన్‌ను పెంచడానికి పని చేస్తాయి. బదులుగా డికాక్షన్ తాగండి. మీకు కావాలంటే జీలకర్ర లేదా ఇతర హెర్బల్ టీని కూడా తీసుకోవచ్చు. ఈ సమయంలో వేడి ద్రవాలను తీసుకోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ వృద్ధి చెందకుండా ఉంటుంది. మీరు సూప్, కొబ్బరి నీరు కూడా తీసుకోవచ్చు. గార్గ్లింగ్ తక్షణ ఉపశమనం ఇస్తుంది

మీ గొంతులో ఏదైనా సమస్య ఉంటే, పుక్కిలించడం వల్ల చాలా త్వరగా ప్రయోజనాలు లభిస్తాయి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించాలి.

మీ ముక్కు మూసుకుపోతుంటే, ఆవిరి పీల్చడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో ఔషధ లేపనాన్ని వేసి ఆవిరి తీసుకోండి. అవి వెంటనే మీ ముక్కును తెరిచి మీకు ఉపశమనాన్ని ఇస్తాయి. తల భారాన్ని కూడా తొలగిస్తాయి.

విటమిన్లు..

శరీరానికి విటమిన్లు, ఖనిజాల పోషణకాలు కొనసాగితే, ఏ వైరస్ మీ శరీరంలో ఎక్కువ కాలం జీవించదు. అందువల్ల, మీ శరీర పరిస్థితి గురించి మీ వైద్యుడికి చెప్పి తగిన సలహాలు తీసుకోవడం మంచింది. వారు సూచించిన సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించి, రోగనిరోధక శక్తిని పెంచుకోండి.

ఈ ఆహారాలు తీసుకోవడం మరవొద్దు..

వింటర్ సీజన్లో, మధ్యాహ్నం నారింజ, రేగు, బెర్రీలు, అరటిపండ్లు తినడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది.

ఈ సీజన్‌లో క్యారెట్, బీట్‌రూట్, టర్నిప్, టొమాటో, ముల్లంగి సలాడ్‌లను తయారు చేసి, మధ్యాహ్నం గోరువెచ్చని ఎండలో కూర్చుని తినండి.

Tags:    

Similar News