Health Tips: మలబద్దాకానికి ఇంటి వైద్యం.. ఈ ఐటమ్స్ సూపర్‌గా పనిచేస్తాయి..!

Health Tips: భారతదేశంలో మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఎందుకంటే ప్రజలు ఆయిల్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Update: 2023-12-08 16:00 GMT

Health Tips: మలబద్దాకానికి ఇంటి వైద్యం.. ఈ ఐటమ్స్ సూపర్‌గా పనిచేస్తాయి..!

Health Tips: భారతదేశంలో మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఎందుకంటే ప్రజలు ఆయిల్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా తక్కువ ఫైబర్ ఫుడ్ తినడం, పని చేయకపోవడం, తక్కువ నీరు తాగడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటప్పుడు మల విసర్జనలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే సహజ పద్ధతుల ద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. పెరుగు, అవిసె గింజల పొడి

పెరుగు కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే బిఫిడోబాక్టీరియం లాక్టిస్ అనే ప్రోబయోటిక్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో అవిసె గింజలను కలిపితే శరీరానికి కరిగే పీచు అందుతుంది. దీని వల్ల మలం మృదువుగా మారి సులభంగా బయటకు వస్తుంది.

2. ఉసిరి రసం

ఉసిరి మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందించడమే కాకుండా సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. 30 మి.గ్రా ఉసిరి రసాన్ని నీటితో కలిపి ఉదయం పరగడుపున తాగాలి. దీంతో త్వరలో ఉపశమనం కలుగుతుంది.

3. నెయ్యి, పాలు

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రేగు జీవక్రియను మెరుగుపరుస్తుంది. మలాన్ని బయటకు తరలించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి ఒక కప్పు వేడి పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగాలి.

4. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సహాయంతో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందుకోసం బ్రోకలీ, బచ్చలికూర, బ్రస్సెల్స్ మొలకలు వంటి వాటిని తినాలి. ఫైబర్‌తో పాటు విటమిన్ సి, ఫోలేట్ కూడా వీటిలో ఉంటాయి. ఇవి పేగు పనితీరును మెరుగుపరుస్తాయి.

5. నీరు తాగండి

మీరు రోజంతా సరైన మొత్తంలో నీటిని తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందుతారు. ఇలా చేయని వారు పొట్ట సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు తగినంత నీరు తాగాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News